ఆ 2 సినిమాలు ఏమైపోయాయి పవన్?

తాజాగా పవన్ ఓ సినిమా ప్రకటించారు. డీవీవీ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. దీంతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీశ్ శంకర్ దర్శకత్వంలో కూడా సినిమా చేయబోతున్నారు.…

తాజాగా పవన్ ఓ సినిమా ప్రకటించారు. డీవీవీ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. దీంతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీశ్ శంకర్ దర్శకత్వంలో కూడా సినిమా చేయబోతున్నారు. ఈ ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లో రాబోతోంది.

ఈ రెండు సినిమాల రాకతో ఆల్రెడీ అనుకున్న 2 సినిమాలు ఇప్పుడు డైలమాలో పడ్డాయి. సముత్తరఖని దర్శకత్వంలో పీపుల్ మీడియా బ్యానర్ పై వినోదాయశితం రీమేక్ చేయాలి పవన్. సినిమా పూజ కూడా జరిగింది. ఇక రామ్ తళ్లూరి నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి. ఈ మూవీ ప్రకటన కూడా అధికారికంగా వచ్చింది.

ఇప్పుడీ 2 సినిమాల్ని పవన్ దాదాపు పక్కనపెట్టినట్టు కనిపిస్తోంది. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత సుజీత్, హరీశ్ శంకర్ సినిమాలకు మాత్రమే కాల్షీట్లు ఇవ్వాలని పవన్ నిర్ణయించుకున్నారు. మరి సురేందర్ రెడ్డి, సముత్తరఖని సినిమాల పరిస్థితేంటి?

ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పవన్ ఇంకొక్క సినిమాకు మాత్రమే కాల్షీట్లు కేటాయించగలరు. కానీ ఆయన 2 సినిమాలకు కాల్షీట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అలాంటిది సురేందర్ రెడ్డి, సముత్తరఖని సినిమాలు కూడా చేయాలంటే పవన్ కు సాధ్యమయ్యే పని కాదు.

ఎన్నికల తర్వాత ఈ రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఆగిపోయే ప్రసక్తి మాత్రం లేదు. ఎందుకంటే, ఇటు రామ్ తళ్లూరి, అటు టీజీ విశ్వప్రసాద్… ఈ ఇద్దరి అడ్వాన్సులు పవన్ దగ్గర ఉన్నాయి. పోనీ అడ్వాన్సులు వెనక్కి ఇద్దామంటే, ఎన్నికల తర్వాత పవన్ కు ఆర్థికంగా అంత సీన్ ఉండకపోవచ్చు.