పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ సంచలనం. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఆయన రావడం, చేసిన ప్రసంగం ఓ సంచలనం. దాంతో టాలీవుడ్ కు జరగాల్సిన మేలు వెనక్కు జరిగింది. అదంతా వేరే సంగతి. కానీ పవన్ ఫంక్షన్ కు వస్తే, ఆ సినిమాకు వచ్చే క్రేజ్ వేరుగా వుంటుంది.
అలాంటి క్రేజ్ మరోసారి కనిపించబోతోందని తెలుస్తోంది. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర నిర్మించిన 'మహా సముద్రం' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా పవన్ ను రప్పించడానికి ప్రయత్నాలు షురూ అయ్యాయి.
అనిల్ సుంకర ఓ సినిమాను మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నారు. అయితే మెగాస్టార్ తన సన్నిహితుడు, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకు మాట ఇచ్చారు. ఆయన పెళ్లి సందడి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు గెస్ట్ గా వస్తానని. దాంతో ఇప్పుడు అనిల్ సుంకర, పవర్ స్టార్ ను అప్రోచ్ అయినట్లు కనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ ఓకె అంటే,ఆయన ఫ్యాన్స్ కు మళ్లీ పూనకాలే. అయితే ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ పొలిటికల్ టచ్ స్పీచ్ వుండదు. ఎందుకుంటే మొన్నటికి మొన్నే ఆయన స్పీచ్ వల్ల టాలీవుడ్ కు జరిగిన నష్టం తెలిసిందే కదా.