పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన చేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఓ అపీల్ చేసారు. తనతో సమస్య అన్నది మరచిపోయి, ఇండస్ట్రీకి న్యాయం చేయాలని, టికెట్ రేట్లు ఇవ్వాలని, ఆ విధంగా ఇండస్ట్రీని బతికించాలని సిఎమ్ జగన్ ను కోరుతూ ఓ వీడియో బైట్ ఇచ్చారు. కానీ అది ఇప్పుడు మాయమైంది.
కొద్ది రోజుల క్రితం సినిమా నిర్మాతలు కొందరు మంత్రి పేర్ని నానిని కలిసి వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్ ను కలిసారు. ఆ సందర్భంగా అన్ని చర్చలు ముగిసాక, ఓ వీడియో బైట్ రికార్డు చేసినట్లు బోగట్టా. అలాగే నిర్మాతలు ఫొటోలు దిగారు. ఈ కంటెంట్ అంతా బయటకు వదిలే బాధ్యతను ఓ నిర్మాతకు ఇచ్చారు.
ఆ తరువాత నిర్మాతలు అందరితో కలిసిన వీడియో వచ్చింది. నిర్మాతల వెర్షన్ వచ్చింది. కానీ పవన్ బైట్ మాత్రం బయటకు రాలేదు. మరి అంతలోనే ఏమయిందో తెలియదు.
సాధారణంగా పవన్ కు చెప్పకుండా విడుదల ఆపరు. అలా విడుదల ఆపాల్సిన అవసరం నిర్మాతలకు లేదు. అంటే ఆ కొద్ది నిమషాలలోనే పవన్ మళ్లీ తన మనసు మార్చుకుని, ఆ నిర్మాతకు ఫోన్ చేసి చెప్పి వుండాలి. బైట్ విడుదల ఆపమని.
గమ్మత్తేమిటంటే బైట్ ఎందుకు బయటకు రాలేదో, పవన్ కలిసిన నిర్మాతల్లోనే చాలా మందికి తెలియదు. తను జగన్ కు అపీల్ చేయడం ఏమిటి? అని పవన్ అనుకుని మనసు మార్చుకున్నారేమో?