పవన్ రమ్మంటే రెడీ – బన్నీవాస్

పవన్ కళ్యాణ్ రమ్మని చెబితే రాబోయే ఎన్నికల్లో ఆయన తరపున పని చేయడానికి సిద్దమని నిర్మాత బన్నీ వాస్ అన్నారు. 2019 ఎన్నికల్లో పవన్ తరపున భీమవరంలో బన్నీ వాస్ అన్నీ తానై వ్యవహరించిన…

పవన్ కళ్యాణ్ రమ్మని చెబితే రాబోయే ఎన్నికల్లో ఆయన తరపున పని చేయడానికి సిద్దమని నిర్మాత బన్నీ వాస్ అన్నారు. 2019 ఎన్నికల్లో పవన్ తరపున భీమవరంలో బన్నీ వాస్ అన్నీ తానై వ్యవహరించిన సంగతి తెలిసిందే. కానీ ఆ తరువాత ఆయన జనసేనకు కాస్త దూరంగానే వున్నారు. అంత యాక్టివ్ గా లేరు. 

అయితే పవన్ కు బన్నీ వాస్ కు మధ్య కాస్త అంతరం పెరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అలా అని బన్నీవాస్ వేరే పార్టీకి దగ్గరయ్యారని కాదు. జనసేనకు దగ్గరగా వున్నారనీ కాదు. సినిమాల్లో బిజీగా వుంటూ రాజకీయాలకు మాత్రం దూరంగా వుంటున్నారు.

ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలు వస్తున్నాయి. మళ్లీ పనవ్ తరపున పనిలోకి దిగుతారా? జనసేన తరపున పని చేస్తారా అన్న ప్రశ్న బన్నీ వాస్ కు మీడియా నుంచి ఎదురయింది. జనసేన తోనే వున్నానని, దాని కోసం పని చేయడానికి ఎప్పుడయినా రెడీ అని బన్నీ వాస్ క్లారిటీ ఇచ్చారు. 

మరి పవన్ తరపున ఎన్నికల ఏజెంట్ గా పనిచేయడానికి అని అడిగితే బదులిస్తూ, పవన్ కనుక కోరితే దానికి రెడీ అన్నారు. అంటే పవన్ ఈసారి బన్నీ వాస్ ను తన తరపున పని చేయాలని, అడుగుతారో, అడగరో అన్నది క్లారిటీ లేదన్న మాట.

జనసేనలో కొందరి వల్ల పవన్ కు బన్నీ వాస్ కు మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని, వకీల్ సాబ్ విడుదల టైమ్ లో ఇది కాస్త వైడన్ అయిందని టాక్ వుంది. ఎన్నికల వేళకు మళ్లీ పవన్ దగ్గరకు తీస్తారేమో బన్నీ వాస్ ను అన్నది చూడాలి.