స్కంధ లో కూడా ఫ్యామిలీ ఎలిమెంట్!

దర్శకుడు బోయపాటికి ఓ స్టయిల్ వుంది. పక్కా మాస్ యాక్షన్ స్టయిల్ అది. చాలా మంది అదే చూస్తారు. అదే టైపు యాక్షన్ రిపీట్ చేయాలనుకుంటారు. కానీ ఆ బలమైన యాక్షన్ వెనుక అంతకన్నా…

దర్శకుడు బోయపాటికి ఓ స్టయిల్ వుంది. పక్కా మాస్ యాక్షన్ స్టయిల్ అది. చాలా మంది అదే చూస్తారు. అదే టైపు యాక్షన్ రిపీట్ చేయాలనుకుంటారు. కానీ ఆ బలమైన యాక్షన్ వెనుక అంతకన్నా బలమైన ఎమోషన్, దాని వెనుక కుటుంబ బాంధవ్యాలు.. ఇదీ సెటప్. 

బోయపాటి సినిమాలు అన్నింటిలో ఇదే తరహా స్కీమ్ వుంది. కుటుంబ నేఫథ్యం రాసుకునే, యాక్షన్ దిశగా కథను నడిపిస్తారు. ఇప్పుడు స్కంధ కూడా అదే తరహాలో వుంటుందని తెలుస్తోంది. 

ఇప్పటి వరకు స్కంధ నుంచి వచ్చిన పబ్లిసిటీ మెటీరియల్ అంతా అవుట్ అండ్ మాస్ యాక్షన్ కిందే కనిపిస్తూ వస్తోంది. ట్రయిలర్ లో ఒకటి రెండు డైలాగులు తప్ప ఫ్యామిలీ టచ్ కనిపించలేదు. బోయపాటి ట్రాక్ మార్చి ‘ఇస్మార్ట్’ ట్రాక్ లోకి వచ్చారా అన్న అనుమానాలు కలిగాయి.

కానీ సినిమాలో బోయపాటి ఒరిజనల్ అలాగే వుంది అని తెలుస్తోంది. జనాలకు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు, అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ట్రయిలర్ ఒకటి కట్ చేసారట. ఒకటి రెండు రోజుల్లో ఈ ట్రయిలర్ ను వదిలే ఆలోచనలో వున్నారట. ఫ్యామిలీ ఏమోషన్లు, దాంతో పాటు వచ్చే బలమైన సన్నివేశాలు, వాటి మధ్యనే మిగిలిన మాస్ ఎలిమెంట్స్ వుంటాయనే క్లారిటీని ఈ ట్రయిలర్ తో ఇవ్వబోతోందట స్కంధ యూనిట్.