కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్

పురాతనమైన పద్యంలో లైన్ ఇది. ఓ మదపుటేనుగుల గుంపు వెళ్లి దోమ గొంతుకలో చిక్కుకుందన్నది అని అర్థం. మదపుటేనుగు సైజు ఎంత.. దోమ గొంతు ఎంత? అసలు ఇది సాధ్యం అన్నది సహేతుకమైన అనుమానమే…

పురాతనమైన పద్యంలో లైన్ ఇది. ఓ మదపుటేనుగుల గుంపు వెళ్లి దోమ గొంతుకలో చిక్కుకుందన్నది అని అర్థం. మదపుటేనుగు సైజు ఎంత.. దోమ గొంతు ఎంత? అసలు ఇది సాధ్యం అన్నది సహేతుకమైన అనుమానమే కదా.

నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి తలుచుకుంటే ఇదే గుర్తుకు వస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఓ సామాజిక వర్గం తమ ఆరాధ్యుడిగా, జాతి నాయకుడిగా భావించే ఎన్టీఆర్ ను వాళ్లే చేతనే అధికారం నుంచి లాగేలా చేసారు. వాజపేయిని పిఎమ్ ను చేసారు. అబ్దుల్ కలాం ను రాష్ట్రపతిని చేసారు. బాలయోగిని స్పీకర్ చేసారు.

అంత ఎందుకు, నిజాం లు నిర్మించిన హైదరాబాద్ ను తానే నిర్మించాననే పేరు, ప్రచారం తెచ్చుకున్నారు. వీటన్నింటికి తోడు ఏ వ్యవస్థను అయినా తాను మేనేజ్ చేయగలరు అన్న పేరు వుండనే వుంది. అలాంటి చంద్రబాబు ఇప్పుడు జస్ట్ చిన్న దోమకు భయపడుతున్నారు. దొమ అనే బయో వెపన్ తో చంద్రబాబుకు జగన్ హాని తలపెడుతున్నారని లోకేష్ బాబు ఆరొపిస్తున్నారు. జైలులో దోమలు వున్నాయని, దాని వల్ల ఓ ఖైదీ కి డెంగూ వచ్చి చనిపోయాడని, చంద్రబాబును కూడా అదే రీతిలో చేయడానికి జగన్ పన్నాగం పన్నారని లోకేష్ అంటున్నారు.

అంటే ఇప్పుడు ఎక్కడెక్కడి దోమలను ఒడుపుగా పట్టి, రాజమండ్రి జైలులోని చంద్రబాబు బ్యారెక్స్ లోకి వదులుతారన్నమాట. నిజానికి దోమలు లేనిది ఎక్కడ..హైదరాబాద్ లో ఇరవై, ముఫై అంతస్థుల ఎత్తులో కూడా దోమలు వుంటున్నాయి. ఇక జైలు అనగా ఎంత? కానీ ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే చంద్రబాబు ఆర్డినరీ ఖైదీ కాదు. రాజకీయ ఖైదీ. ఆయనకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు వుంటాయి.

ఏ నేరం చేయకపోయినా ఓ మనిషి చంద్రబాబుకు సహాయంగా వుండేందుకు జైలులో వుంటారు. ఫ్యాన్ వుంటుంది. మంచం వుంటుంది. ఇంటి భోజనం వుంది. ఇవేవీ సాధారణ ఖైదీలకు వుండవు. ఓ బ్యారెక్స్ మొత్తం చంద్రబాబు కే కేటాయించారు. అదే మామూలుగా అయితే కనీసం ఇరవై ముఫై మంది వుంటారు అక్కడ. అందువల్ల ఫ్యాన్ వుంది కనుక, వ్యక్తిగత సహాయకుడు వున్నారు కనుక, ఓ మస్కిటో కాయిల్ పెట్టుకోవడం పెద్ద కష్టం కాదు.

కానీ జనాల్లో సింపతీ కావాలి కనుక లోకేష్ ఈ మార్గం ఎంచుకుని వుండొచ్చు. కానీ లోకేష్ చేస్తున్న ఆరోపణ వింటే మాత్రం మదపుటేనుగుల గుంపు వెళ్లి దొమ గొంతులో చిక్కిన దుస్థితినే బాబుగారికి కూడా వచ్చిందనిపిస్తోంది.