ఇప్పటికే రెండు సినిమాలు నిర్మాణంలో వున్నాయి. ఓ సినిమా విడుదలకు రెడీగా వుంది. చేయాల్సిన ఆబ్లిగేషన్లు రెండు మూడు వున్నాయి. భగవాన్ పుల్లారావులకు ఓ సినిమా, పీపుల్స్ మీడియాకు మరో సినిమా, రామ్ తాళ్లూరికి ఓ సినిమా చేయాల్సి వుంది. అంటే పవన్ తన సెకెండ్ ఇన్నింగ్స్ లో చేసే టోటల్ సినిమాల సంఖ్య 7 కు చేరినట్లే.
వకీల్ సాబ్, భీమ్లా నాయక్, హరి హర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ సినిమాలు ఫిక్స్. పీపుల్స్ మీడియా సినిమా ఫిక్స్. ఇక భగవాన్ పుల్లారావు, రామ్ తాళ్లూరి ల సినిమాకు ఫైనల్ కావాల్సి వుంటుంది.
2024 లో ఎన్నికలు వుంటాయి అనుకుంటే 2022 నుంచి 2023 వరకు పవన్ డైరీ ఫుల్ అయిపోయినట్లే. ఇవన్నీ ఇలా వుంటే ఎన్నికల ముందు ఓ మాంచి మాస్ పొలిటికల్ సినిమా చేసే ఐడియా కూడా వుంది. దానికి ఓ టాప్ మాస్ డైరక్టర్ పని చేసే అవకాశం కూడా వుంది. అంటే అది ఎనిమిదోది అవుతుంది.
సినిమాకు యాభై కోట్లు వేసుకున్నా టోటల్ 400 కోట్లు అన్నమాట.. రాజకీయాల్లో నాలుగేళ్లు బిజీగా గడిపితే ఖర్చు తప్ప ఒరిగేది వుండదు. అందుకే సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వుంటారు.