పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలియాస్ జనసేనాధిపతి రాజకీయ పాదయాత్ర చేస్తారని చిరకాలంగా వినిపిస్తోంది. కానీ ఆయనకు పాదయాత్ర చేసేంత తీరుబాటు లేదు ఓపిక అంతకన్నా లేదు. ఆ సంగతి అందరికీ తెలిసిందే.
కానీ ఆంధ్ర సిఎమ్ జగన్ ను జనంలో పలుచన చేయడానికి ఏదో ఓ కార్యక్రమం ఏదో ఒక రూపంలో నిత్యం జరుగుతూవుండాలి. అలా అని అది రాజకీయ యాత్రలా కనిపించకూడదు.
ఆ మధ్య అమరావతి రైతుల న్యాయస్థానం టు దేవస్థానం అంటూ ఒక యాత్ర కోట్ల ఖర్చుతో నిర్వహించారు. దాని వెనుక అర్థం ఎవరిది? పరమార్థం ఏమిటి? అన్నది అందరికీ తెలిసిందే. ఇప్పుడు కాస్త గ్యాప్ వచ్చింది. ఎన్నికలు ఇంకో ఏడాది వుందనగా చంద్రబాబు..లోకేష్ యాత్రలు ఎలాగూ చేస్తారు.
కానీ ఈలోగా మరో ఏడాది పాటు ఏం చేయాలి. అందుకే వేసిన మాస్టర్ ప్లాన్ నారసింహ క్షేత్రాల యాత్ర. అది కూడా కేవలం రెండు క్షేత్రాలు మాత్రం తెలంగాణలో ఎంచుకుని, మిగలిన 30 క్షేత్రాలు ఆంధ్రలో ఎంచుకున్నారు. అది కూడా వరుసగా దర్శించరు. పవన్ సినిమాల షెడ్యూలు, వెసులుబాటు చూసుకుని ఒక్కో జిల్లాలో వున్న నారసింహ క్షేత్రాలు సందర్శించుకుంటూ వెళ్తారు అన్నమాట.
అలా వెళ్లినపుడల్లా పనిలో పనిగా రాఙకీయ విమర్శలు, హిందూ ధర్మం, దానికి అర్జెంట్ గా వాటిల్రిన ప్రమాదాలు ఇవన్నీ ప్రస్తావిస్తూ, యాంటీ మైనారిటీ ఓటు బ్యాంకును జగన్ కు వ్యతిరేకంగా పోగేసే పని పెట్టుకుంటారన్నమాట. కానీ జనాలు వెర్రివాళ్లు కాదు. పవన్ తీర్థయాత్రల పరమార్థం ఏమిటో? అది ఎవరిని బలోపేతం చేయడానికో? ఎవరికి లాభసాటి చేయడానికో అన్నది తెలియని వెర్రివాళ్లు కాదు.
దీనివల్ల పవన్ పై వున్న ‘ప్యాకేజ్ స్టార్’ అనే ముద్ర మరింత బలంగా పడిపోతుంది. తనకు ఉపయోగం లేకుండా వేరే వాళ్లకోసం ఇలాంటి యాత్రలు తలపెడితే, అది కూడా తన పేరు వాడుకుంటూ పొలిటికల్ యాత్రలు చేస్తే ఆ దేవుడు మాత్రం ఫలితాన్ని ఇస్తాడా?