Advertisement

Advertisement


Home > Movies - Movie News

దేవుడి షూ ఖరీదు అక్షరాలా లక్ష

దేవుడి షూ ఖరీదు అక్షరాలా లక్ష

దేవుడు షూ వేసుకుంటాడా? ఇలాంటి లాజిక్కులు, తర్కాలు మనకు అనవసరం. సినిమాల్లో దేవుడు షూ వేసుకుంటాడంతే. అవసరమైతే విదేశాల నుంచి దిగుమతి చేసుకొని మరీ వేసుకుంటాడు. మన దేవుడు బ్రో కూడా షూ వేసుకున్నాడు. ఇక్కడ 'దేవుడు బ్రో' అంటే పవన్ కల్యాణ్.

పవన్ కల్యాణ్, సాయితేజ్ కలిసి బ్రో అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే హీరోల లుక్స్ రిలీజయ్యాయి. ఈరోజు ఇద్దరు హీరోలు కలిసి దిగిన ఫొటోను విడుదల చేశారు.

ఇందులో పవన్ కల్యాణ్ దేవుడిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. కాకపోతే ఈ దేవుడు స్టయిలిష్ గా కనిపిస్తాడు. ఈ దేవుడు బ్రో కోసం కాస్ట్ లీ లగ్జరీ బైక్ సెట్ చేశారు. అంతేకాదు, ఖరీదైన షూ కూడా కొనుగోలు చేశారు. పోస్టర్ లో పవన్ కల్యాణ్ వేసుకున్న షూ ఖరీదు అక్షరాలా లక్ష రూపాయలు.

పారిస్ కు చెందిన బాల్మేన్ కంపెనీకి చెందిన షూ ఇది. పవన్ కోసం ఇలాంటివి 3 జతలు కొనుగోలు చేశారట. అంటే, సినిమాలో పవన్ షూల కోసమే 3 లక్షలకు పైగా ఖర్చయిందన్నమాట.

మేకప్ వేసుకుంటే ఇంకా బాగుండేది "బ్రో"

ఈ యాక్ససిరీస్ సంగతి పక్కనపెడితే.. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో పవన్ లుక్ పై ఫ్యాన్స్ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోస్టర్ లో సాయితేజ్ బాగున్నాడు కానీ, పవన్ కు బొత్తిగా మేకప్ వేసినట్టు లేదని పెదవి విరుస్తున్నారు కొంతమంది. వేసుకున్న డ్రెస్ కూడా సాదాసీదాగా కనిపించడం అభిమానులకు నచ్చలేదు. అయితే 'స్వామి దర్శనం' చాలని, మేకప్ తో పనేముందని ప్రశ్నించే అభిమానులు కూడా ఎక్కువగానే ఉన్నారు.

మొత్తానికి ఈ పోస్టర్ తో బ్రో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తమిళ్ లో వచ్చిన వినోదాయ శితం సినిమాకు రీమేక్ గా బ్రో వస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి పవన్-సాయితేజ్ మధ్య ఓ సాంగ్ షూట్ చేయబోతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?