పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్నాళ్ల పాటు రాజకీయాలకు, సినిమాలకు దూరంగా వుండబోతున్నారు. పక్కా ఫ్యామిలీ మన్ గా వుంటారు. క్రిస్మస్ పండగ సందర్భంగా ఆయన రష్యాకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.
పవన్ సతీమణి రష్యా ప్రాంతానికి చెందిన వారన్న సంగతి తెలిసిందే. ఆమె గత కొంత కాలంగా పిల్లలతో అక్కడే వుంటున్నారు. కోవిడ్ సెకెండ్ ఫేఙ్ కు కాస్త అటు ఇటుగా అక్కడకు వెళ్లారు.
అప్పటి నుంచీ అక్కడే వున్నారు. ఈ నేపథ్యంలో క్రిస్మస్ పండగ వస్తోంది. ఈ పండగలో భార్య, పిల్లలతో పాలు పంచుకునేందుకు పవన్ అక్కడకి వెళ్లబోతున్నారని తెలుస్తోంది.
బహుశా భీమ్లా నాయక్ విడుదలకు కొద్ది రోజుల ముందుగా తిరిగి ఇక్కడకు చేరుకుంటారు. ఈ నెల 20 వ తేదీ తరువాత రష్యా వెళ్లి ఫస్ట్ వీక్ లో తిరిగి వచ్చే అవకాశం వుంది.
అంటే సుమారుగా రెండు వారాల పాటు సినిమాలు, రాఙకీయాలు అన్నీ వదిలేసి, ప్రశాంతంగా ఫ్యామిలీతో గడుపుతారన్నమాట.