పవన్-శ్రీలీల..ట్రోలింగ్..ట్రోలింగ్

తెరి రీమేక్ అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి దర్శకుడు హరీష్ శంకర్ మీద ట్రోలింగ్ నడిచింది. రీమేక్ వద్దూ అంటూ. సరే, ఆ సంగతి అలా వుంచితే ఇప్పుడు అదే సినిమాకు శ్రీలీల…

తెరి రీమేక్ అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి దర్శకుడు హరీష్ శంకర్ మీద ట్రోలింగ్ నడిచింది. రీమేక్ వద్దూ అంటూ. సరే, ఆ సంగతి అలా వుంచితే ఇప్పుడు అదే సినిమాకు శ్రీలీల ను హీరోయిన్ గా తీసుకుంటున్నారని వార్తలు బయటకు రావడంతోనే ట్రోలింగ్ పవన్ మీదకు తిరిగింది. 

తన వయసులో సగం వయసు కూడా లేని శ్రీలీలతో నటించడం ఏమిటీ అంటూ ట్రోల్ చేస్తున్నారు. అజిత్, బాలయ్య చిన్న వయసు క్యారక్టర్ ఆర్టిస్ట్ లతో చేసిన సీన్లు పోస్ట్ చేసి పవన్ ను ఎద్దేవా చేస్తున్నారు.

దీన్ని కవర్ చేయడానికి ఎన్టీఆర్..ఎఎన్నార్..శ్రీదేవి సీన్లు పోస్ట్ చేసే వారూ కనిపిస్తున్నారు. కానీ గమ్మత్తేమిటంటే పవన్ ఫ్యాన్స్ కు కూడా ఈ కాంబినేషన్ నచ్చడం లేదు. మాళవిక మోహనన్ తీసుకో అంటూ కామెంట్ లు పెడుతున్నారు. అంతే కాదు, అసలు ఈ సినిమా కాదు, ముందు హరిహర వీరమల్లు పూర్తి చేసి వదలమని ఫ్యాన్స్ గోల పెడుతున్నారు. హరిహర వీరమల్లు సంగతేమిటి అని నిలదీస్తున్నారు.

ఇవన్నీ ఇలా వుంటే అసలు సినిమాలు కాదు, వారాహిని బయటకు తీయండి. మాకు అదే కావాలి. అంటూ అసలైన పవన్ ఫ్యాన్స్ సూచిస్తున్నారు. మొత్తం మీద పవన్ కు కూడా ఫ్యాన్స్ నుంచి నిర్మొహమాటంగా ట్రోలింగ్ వస్తోంది. అయినా పవన్ ఇవన్నీ పట్టించుకునే బాపతు కాదు. ఆయన ఏది అనుకుంటే అదే చేస్తారు. అంతే.