జగన్ మీద అయితే ఒంటి కాలితో లేచిపోతారు. ఊరూరా ధరల పెరుగుదలకు జగన్ నే కారణం అంటారు. పెట్రోలు మంటలకు కూడా జగన్ నే కారణం అంటారు. ఏమన్నా అంటే బాబు జమానా నుంచి కొనసాగుతున్న పద్దతులను జగన్ ఖాతాలో వేసి మరీ చూపిస్తారు.
అంతే తప్ప మోడీ గురించి అస్సలు ప్రస్తావించరు. పొరపాటున కూడా నిలదీయరు. చంద్రబాబు అండ్ లోకేష్ బాబుల తీరు ఇది. వారి కన్నా వారి లోకల్ లీడర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి చాలా బెటర్. చిరకాలంగా తన ట్వీట్ ల ద్వారా మోడీ ప్రభుత్వాన్ని అంతో ఇంతో నిలదీస్తూనే వున్నారు. కనీసం ఆ పాటి కూడా ఈ తండ్రీ కొడుకులు చేయలేకపోయారు. కారణం మోడీ అంటే భయం.
ప్రతిపక్షంలో వున్నపుడు భాజపా నేతలు వంట గ్యాస్ ధర మీద నానా యాగీ చేసారు. ఇప్పుడు మంత్రులుగా వున్నవారంతా అప్పుడు ప్రజల్లోకి వచ్చి సిలెండర్లు పట్టుకుని ఉద్యమాలు చేసిన వారే. ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా రేట్లు పెరుగుతుంటే, పెంచుతుంటే ఇదంతా దేశం కోసమే అంటూ అర్థం లేని లాజిక్కలు చెబుతున్నారు.
మోడీ హయాంలో దాదాపు వెయ్యి రూపాయలు పెరిగింది గ్యాస్ సిలెండర్ ధర. ఈ రోజు యాభై రూపాయలు పెంచారు. మరి ఇప్పుడు తండ్రీ కొడుకుల గొంతు లేవదేం? జనాలకు కళ్లు మూసి జెల్ల కొడుతున్నారని అనడానికి కూడా లేదు. ఎందుకంటే జగన్ జనం దగ్గర నుంచి తీసుకున్నా జనానికే ఇస్తున్నాడు. కానీ మోడీ తీసుకోవడం తప్ప ఇవ్వడం లేదు.
ఇప్పుడు కూడా అటుచేసి ఇటు చేసి, జగన్ పోరాటం చేయలేదు. కేంద్రం అంటే భయం, కేసులు వున్నాయి అంటూ ఎటో మాట్లాడతారు తప్ప, మోడీ గురించి మాట్లాడడానికి తండ్రీ కొడుకులకు నోరు అస్సలు పెగలదు. పోనీ లోకేష్ బాబూ..గ్యాస్ సిలెండర్ తో ఓ సెల్ఫీ దిగొచ్చుగా.