ఆత్మహత్య చేసుకుంటావా.. అయితే వెళ్లి చావు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో బాలీవుడ్ లో వాతావరణం ఒక్కసారిగా సీరియస్ గా మారిపోయింది. మిగతా నటీనటులు కూడా సుశాంత్ సూసైడ్ తో డల్ అయిపోయారు. ఇలాంటి టైమ్ లో “నేను ఆత్మహత్య…

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో బాలీవుడ్ లో వాతావరణం ఒక్కసారిగా సీరియస్ గా మారిపోయింది. మిగతా నటీనటులు కూడా సుశాంత్ సూసైడ్ తో డల్ అయిపోయారు. ఇలాంటి టైమ్ లో “నేను ఆత్మహత్య చేసుకుంటా” అంటూ ఎవరైనా పోస్ట్ పెడితే ఎలా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి అనుభవమే హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు ఎదురైంది.

ఫ్యాన్స్ తో ఛాటింగ్ ఓపెన్ చేసింది పాయల్. అందరూ అడుగుతున్న ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెబుతోంది. ఇంతలో సెడన్ గా ఓ సందేశం.. “నాకు ఆత్మహత్య చేసుకోవాలని ఉంది, నేను చచ్చిపోతానంటూ” పాయల్ వాల్ పై మెసేజ్ ప్రత్యక్షమైంది. దీంతో పాయల్ కు ఒక్కసారిగా కోపం తన్నుకొచ్చింది.

“ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా.. ఓకే వెళ్లి చావు.. ఇది నీ నిర్ణయం.. కానీ ఆత్మహత్య అనేది నీ సమస్యకు పరిష్కారం కాదు.” ఇలా ఘాటుగా స్పందించింది పాయల్ రాజ్ పుత్. 

సుశాంత్ ఆత్మహత్యతో పాయల్ చలించిపోయింది. “ఎందుకిలా చేశావ్ సుశాంత్” అంటూ చాలా భావోద్వేగంతో రియాక్ట్ అయింది. దాదాపు 3 రోజులుగా సోషల్ మీడియాకు కూడా దూరమైంది. మళ్లీ ఇప్పుడిప్పుడే తేరుకుందనుకునే టైమ్ లో అభిమాని అడిగిన “సూసైడ్ క్వశ్చన్”తో పాయల్ కు తిక్కరేగింది. అందుకే వెళ్లి చావు అంటూ ఘాటుగా స్పందించింది.

చైనాకి బుద్ధి చెబుదాం

మరో 30ఏళ్ళు నువ్వే ఉండాలన్నా