ఆర్ఎక్స్ 100 సినిమాతో పాయల్ ను పరిచయం చేశారు దర్శకుడు అజయ్ భూపతి. కాబట్టి ఆటోమేటిగ్గా మంగళవారం సినిమా కోసం ఆమెను తీసుకొని ఉంటాడని చాలామంది అనుకున్నారు. కానీ అజయ్ భూపతి మాత్రం అలా చేయలేదు. తన ఫస్ట్ ఛాయిస్ పాయల్ కాదని అంటున్నారు.
మంగళవారం కథ రాసుకున్న తర్వాత చాలామందిని ట్రై చేశాడట అజయ్. అయితే ఎవ్వరూ సెట్ కాలేదంట. మరికొంతమంది భయపడి పారిపోయారంట. అలాంటి టైమ్ లో పాయల్ ముందకొచ్చిందని చెప్పారు.
“మంగళవారం కథ రాసుకున్న తర్వాత చాలామందిని ట్రై చేశాను. కొంతమంది సూట్ కాలేదు, మరికొందరు సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోయారు. ఈ బోల్డ్ క్యారెక్టర్ చూసి మరికొంతమంది భయపడి పారిపోయారు. అలాంటి టైమ్ లో పాయల్ మెసేజ్ చేసింది. ఆమెకు కూడా స్క్రీన్ టెస్ట్ చేశాను. ఆర్ఎక్స్ 100లో తను చేసినప్పటికీ స్క్రీన్ టెస్ట్ చేసి తీసుకున్నాను. నేను అనుకున్నదానికంటే డబుల్ ఇచ్చింది పాయల్. బోల్డ్ క్యారెక్టర్ సెలక్ట్ చేసుకోవడమే ఆమె సక్సెస్.”
మంగళవారం సినిమాను టెక్నీషియన్స్ సినిమాగా చెప్పుకొచ్చారు అజయ్. ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ కు మంచి రెస్పాన్స్ వస్తోందని.. ఇది టెక్నీషియన్స్ మూవీ అవుతుందని తనకు ముందే తెలుసని అన్నారు. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్న ఈ సినిమాలో ట్విస్టుల్ని బయట డిస్కస్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు.