పాయల్ ఎంత పని చేసిందో చూడండి

ఏదైనా వివాదం జరిగితే సోషల్ మీడియాలో దానిపై రకరకాల వ్యాఖ్యానాలు పుట్టుకొస్తాయి. ఇంకెన్నో రకాలుగా కథనాలు కూడా వచ్చేస్తాయి. సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తులు అలాంటివి క్యారీ చేయకూడదు. ఇంకా చెప్పాలంటే అస్సలు ప్రోత్సహించకుండా…

ఏదైనా వివాదం జరిగితే సోషల్ మీడియాలో దానిపై రకరకాల వ్యాఖ్యానాలు పుట్టుకొస్తాయి. ఇంకెన్నో రకాలుగా కథనాలు కూడా వచ్చేస్తాయి. సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తులు అలాంటివి క్యారీ చేయకూడదు. ఇంకా చెప్పాలంటే అస్సలు ప్రోత్సహించకుండా న్యూట్రల్ గా ఉండాలి. కానీ పాయల్ రాజ్ పుత్ మాత్రం ఓ వివాదాస్పద కథనాన్ని షేర్ చేసింది. అదిప్పుడు మరింత వివాదాస్పదమైంది.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో తీవ్రంగా చలించిపోయింది పాయల్ రాజ్ పుత్. అతడు ఆత్మహత్య చేసుకున్నప్పట్నుంచి ఈమె మనసు మనసులో లేదు. అవే ఆలోచనలు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ స్టోరీని పాయల్ షేర్ చేసింది. సుశాంత్ ను సల్మాన్ ఖాన్, సూరజ్ పంచోలీ కలిసి హత్య చేశారనే వివాదాస్పద కథనం అది.

అసలు మేటర్ లోకి వెళ్తే.. సుశాంత్ మేనేజర్ దిశ, సూరజ్ పంచోలీ చాలా క్లోజ్. ఎంత క్లోజ్ అంటే.. సూరజ్ వల్ల దిశ గర్భవతి అయిందట. విషయం తెలుసుకున్న సూరజ్, దిశను చంపేశాడట. సరిగ్గా గతంలో జియాఖాన్ మరణం కూడా ఇలానే జరిగిందని గుర్తుచేస్తోంది పాయల్ షేర్ చేసిన ఆ కథనం.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సూరజ్-దిశ ఎఫైర్ గురించి కేవలం సుశాంత్ కు మాత్రమే తెలుసట. దీంతో దిశ మరణం తర్వాత సుశాంత్, సూరజ్ కు వ్యతిరేకంగా చాలా గట్టిగా ఫైట్ చేశాడట. కొన్ని ఆధారాలు కూడా సేకరించాడని చెబుతారు. ఈ క్రమంలో మరోసారి సల్మాన్ సహకారంతో సూరజ్, సుశాంత్ పై కక్షకట్టాడనేది ఆ కథనం సారాంశం.

సల్మాన్, సూరజ్ తో పాటు మహేష్ భట్, అండర్ వరల్డ్, కొన్ని రాజకీయ పార్టీలు కలిసి సుశాంత్ ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారనేది మెయిన్ పాయింట్. ఇప్పుడు మనం చెప్పుకున్నది బేసిక్ లైన్ మాత్రమే. దీనికి సంబంధించి దాదాపు 2 పేజీల స్టోరీని పాయల్ రాజ్ పుల్ షేర్ చేసింది. అక్కడితో ఆగలేదు. తక్షణం దీనిపై సీబీఐ విచారణ జరగాలని కూడా డిమాండ్ చేసింది.

ఇలా వివాదాస్పద పోస్ట్ ను షేర్ చేసి పాయల్ కూడా వివాదాస్పదమైంది. దీనిపై కొంతమంది పాయల్ కు వ్యతిరేకంగా కామెంట్ చేస్తే, మరికొంతమంది పాయల్ ను సమర్థిస్తున్నారు. 

కోహ్లీ.. గాలిలో చప్పట్లతో

ఇక నుంచి నో లంచం నో దళారీ