ఓటిటిలో సినిమాలు విడుదల చేస్తే జనం చూస్తారా? అసలు మన బడ్జెట్‌కి వర్కవుట్ అవుతుందా? అనే అనుమానాలే మన నిర్మాతలకున్నాయి. అందుకే ఇంతవరకు కనీసం అయిదు కోట్ల పైచిలుకు బడ్జెట్ వున్న సినిమాను కూడా డిజిటల్‌గా రిలీజ్ చేయలేదు. అయితే కాంటెంట్ బాగున్నట్టయితే పబ్లిసిటీ దానంతట అదే వస్తుందని, సోషల్ మీడియాలో ట్రెండ్ అయి వ్యూస్ వస్తాయని పలు చిత్రాల ద్వారా రుజువయింది.
ఇంతకాలం మీనమేషాలు లెక్క పెట్టిన బాలీవుడ్ పెద్ద చిత్రాలు కూడా నెమ్మదిగా ఇదే బాట పడుతున్నాయి. క్రేజ్ వున్న హీరో లేదా దర్శకుడి సినిమాకి ఖచ్చితంగా వ్యూస్ బాగా వస్తాయి. సినిమా బాగుందనే టాక్ వస్తే ఇలా రిలీజ్ చేయడం వల్ల మరింత మందికి రీచ్ అవుతుంది. ఇప్పటికి కొన్ని సినిమాలకు వచ్చిన రెస్పాన్స్ ద్వారా వచ్చిన కిక్ మరి మన నిర్మాతలకు సరిపోతుందో లేదో?
ఓటిటి ప్లాట్‌ఫామ్స్ కూడా చిన్నాచితకా సినిమాలు కాకుండా వి, రెడ్ లాంటి పెద్ద సినిమాల మీదే దృష్టి పెట్టాయి. ఆ స్థాయి చిత్రాలను రిలీజ్ చేయగలిగితే ఇక పది, పదిహేను కోట్ల స్థాయి చిత్రాలను ఈజీగా ట్రాక్ మీదకు తీసుకుని రావచ్చనేది వాళ్ల ఐడియా. ప్రస్తుతం బాల్ మిడ్ రేంజ్ సినిమాల నిర్మాతల కోర్టులోనే ఉందన్నమాట.