కరోనా టైమ్ లో సిక్స్ ప్యాక్

టైమ్ కోసం వెయిట్ చేస్తున్న హీరోల్లో నాగశౌర్య ఒకడు. మాన్లీగా వుంటాడు. మంచి స్మయిల్..నటనలో పట్టు వుంది. చేసినవన్నీ బాగానే వున్నాయనే టాక్. కానీ రావాల్సిన బ్రేక్ మాత్రం రావడం లేదు. ఇలాంటి టైమ్…

టైమ్ కోసం వెయిట్ చేస్తున్న హీరోల్లో నాగశౌర్య ఒకడు. మాన్లీగా వుంటాడు. మంచి స్మయిల్..నటనలో పట్టు వుంది. చేసినవన్నీ బాగానే వున్నాయనే టాక్. కానీ రావాల్సిన బ్రేక్ మాత్రం రావడం లేదు. ఇలాంటి టైమ్ లో విలువిద్య నేపథ్యంలో సినిమా చేయబోతున్నాడు. సుబ్రహ్మణ్యపురం అనే సినిమా అందించిన డైరక్టర్ సంతోష్ ఈ సినిమాకు దర్శకుడు. ఆసియన్ సునీల్ నిర్మాత. 

అయితే ఈ సినిమాలో హీరో డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడు. వాటిల్లో సిక్స్ ప్యాక్ గెటప్ కూడా వుంది. కరోనా టైమ్ లో జిమ్ కు వెళ్లడం, ట్రయినర్ ను పెట్టుకోవడం ఇవన్నీ సాధ్యం కాదు. కానీ కరోనా అంకం ముగియగానే సెట్ మీదకు వెళ్లాలి. దాంతో నాగ శౌర్య ఇంటి టెర్రస్ నే వెన్యూగా చేసుకున్నాడు. నెలకు అయిదు లక్షల వరకు సిక్స్ ప్యాక్ కోసం తినే ఫుడ్, ఇతరత్రా వ్యవహారాలకు ఖర్చు చేసాడు.

మొత్తం మీద మూడు నెలల్లో మాంచి మస్క్యులర్ బాడీ, సిక్స్ ప్యాక్ ను సాధించేసాడు. త్వరలో ఈ లుక్ ను రివీల్ చేసే అవకాశం వుంది. ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం ఈ మస్క్యులర్ బాడీతో శౌర్య లుక్ షాకింగ్ గా వుంటుందని తెలుస్తోంది. 

రఘురామకృష్ణంరాజు దిగజారిపోయాడు

ఇక నుంచి నో లంచం నో దళారీ