పెద్ద సినిమాల కొత్త ట్రెండ్

సలార్ సినిమాతో పంపిణీ దారు మైత్రీ సంస్థ కొత్త ట్రెండ్ కు దారి తీసింది. ఇప్పుడు గుంటూరుకారం పంపిణీ దారులు కూడా దాన్నే ఫాలో ఫాలో అంటున్నారు. ఇక మీదట హైదరాబాద్‌లో భారీగా బజ్…

సలార్ సినిమాతో పంపిణీ దారు మైత్రీ సంస్థ కొత్త ట్రెండ్ కు దారి తీసింది. ఇప్పుడు గుంటూరుకారం పంపిణీ దారులు కూడా దాన్నే ఫాలో ఫాలో అంటున్నారు. ఇక మీదట హైదరాబాద్‌లో భారీగా బజ్ వున్న ఏ సినిమా అయినా ఇదే రూటు ను ఫాలో అవుతారు. నిజానికి మైత్రీ సంస్థ ఈ కొత్త దారిలో వెళ్లినపుడు విమర్శలు గట్టిగా వినిపించాయి. పంపిణీ సంస్థ ఇలా చేయడం ఏమిటి? అని. కానీ ఇప్పుడు అదే సరైన దారి అని నిర్మాతలు నమ్ముతున్నారు.

విషయం ఏమిటంటే, భారీ బజ్ వున్న సినిమాలు వచ్చినపుడు ఫ్యాన్స్ షో లు బెనిఫిట్ షో లు అని కొన్ని ఏర్పాటు చేసారు. ఏదో ఒక రేటుకు డిస్ట్రిబ్యూటర్ ఎవరో ఒకరికి ఇస్తారు. ఆ వ్యక్తి లేదా ఆ సంస్థ వెళ్లి పోలీస్ అనుమతి తెచ్చుకుని, థియేటర్ ను బేరం చేసుకుని తెల్లవారుఝామున సినిమా వేసుకుంటాడు. దాన్ని రెండు వేలు లేదా వెయ్యి రేట్లకు విక్రయిస్తారు. పేరుకు ఎంతో కొంత మొత్తం ఏదో ఓ సంస్థకు విరాళం ఇస్తారు. ఇదీ ప్రొసీజర్.

కానీ సలార్ కు జరిగింది ఏమిటంటే, పంపిణీ దారుడే నేరుగా స్పెషల్ షో లకు అనుమతి కోరడం అన్నది ఫస్ట్ పాయింట్. గంపగుత్తగా ఓ పదో, ఇరవై నో థియేటర్లకు అనుమతి తీసుకోవడం. ఆ తరువాత ఆ థియేటర్లలో తెల్లవారుఝామున, వేసే ఒకటి లేదా రెండు షో ల టికెట్ లు అన్నీ థియేటర్ నుంచి తమ వద్దకు తెప్పించేసుకోవడం. వాటిని టికెట్ రెండు వేలు వంతున తామే విక్రయించడం. ఎక్కడా రెండువేలు అన్న రేటు వుండదు. మామూలు రేటే వుంటుంది. వీటిలో ఓ పాతిక శాతం టికెట్ లు మాత్రం మొహమాటాలకు వెళ్లిపోతాయి.

రాజకీయ నాయకులు, పోలీసులు, ఇన్ కమ్ టాక్స్, ఫైర్ సర్వీస్, కార్పొరేషన్, ఇలా కొన్ని టికెట్ లు పోగా మిగిలినవి ఈ రేంజ్ లో విక్రయించడం ద్వారా డిస్ట్రిబ్యూటర్ కాస్త సాలిడ్ అమౌంట్ ను ముందే తెప్పించుకోగలుగుతున్నారు. సలార్ సినిమాను 65 కోట్ల నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ మీద తీసుకున్నారు. అంత రిస్క్ వుంది కనుక ఈ కొత్త దారి తొక్కారు.

ఇప్పుడు గుంటూరు కారం కూడా ఇదే పద్దతిలో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇకపై ఏ భారీ బజ్ వున్న సినిమాకు అయినా తెల్లవారు ఝామున ఏ షో అయినా బెనిఫిట్ షో నే. నేరుగా పంపిణీ దారు అయినా టికెట్ లు ఇస్తారు లేదా, గంపగుత్తగా కాస్త తగ్గించి షో ల లెక్కన విక్రయించేస్తారు.

ఇకపై ఇదే పద్దతి అన్ని ఏరియాలకు వెళ్తే సినిమాలకు భారీ కలెక్షన్లు కనిపిస్తాయి. హీరోల రెమ్యూనిరేషన్లు మరింత భారీగా పెరుగుతాయి.