ఆ క్రెడిట్ మొత్తం కీరవాణికి ఇచ్చిన నాగార్జున

గతంలో ఓ సంక్రాంతికి రికార్డ్ టైమ్ లో బంగార్రాజు సినిమాను పూర్తిచేసి రిలీజ్ చేశాడు నాగార్జున. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను, స్పీడ్ ను నా సామిరంగ సినిమాకు చూపించాడు. కేవలం 3 నెలల్లో…

గతంలో ఓ సంక్రాంతికి రికార్డ్ టైమ్ లో బంగార్రాజు సినిమాను పూర్తిచేసి రిలీజ్ చేశాడు నాగార్జున. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను, స్పీడ్ ను నా సామిరంగ సినిమాకు చూపించాడు. కేవలం 3 నెలల్లో సినిమా ఫస్ట్ కాపీ రెడీ చేశాడు. ఈ క్రెడిట్ ను కీరవాణికి ఆపాదించాడు నాగ్.

“మా సినిమాకు స్టార్ కీరవాణి. కేవలం పాటలు ఇవ్వడమే కాదు, ఈ సినిమాను 3 నెలల్లో పూర్తిచేసేలా మా వెనక ఉండి, మమ్మల్ని ముందుకు నడిపించారు. ఈ సినిమా చేయాలి, సంక్రాంతికి అందించాలని అనుకున్నప్పుడు మా అందరికంటే ముందు పని స్టార్ట్ చేశారు. సినిమా స్టార్ట్ అవ్వకముందే 3 పాటలు రెడీ చేసి, మా ముందుపెట్టారు. పాటలే కాదు, సినిమాలో ఫస్ట్ ఫైట్ కు మేమింగా ఫైట్ తీయకుండానే, ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసిపెట్టారు.”

కీరవాణి లాంటి టెక్నీషియన్ ఉంటే చాలు ఏదైనా సాధిస్తామన్నారు నాగ్. కీరవాణి, చంద్రబోస్ సహకారంతోనే దర్శకుడు విజయ్ బిన్నీ ఈ సినిమాను తొందరగా పూర్తిచేయగలిగాడని మెచ్చుకున్నారు.

ఈ సంక్రాంతికి వెంకటేశ్, మహేష్, తేజ సజ్జా సినిమాలు రిలీజ్ అవుతున్నాయని, ఆ సినిమాలు సక్సెస్ అవ్వాలని కోరుకున్న నాగార్జున, ఆ సినిమాలతో పాటు నా సామిరంగ సినిమాను కూడా సక్సెస్ చేయాలని ప్రేక్షకుల్ని కోరారు.

కంటెంట్ బాగుంటే, సినిమాను ఎలా ఆదరిస్తారో, 2 పండగలకు చూశానని, ఈసారి పండక్కి కిష్టయ్య వస్తున్నాడు, బాక్సాఫీస్ ను కొడుతున్నాడంటూ నమ్మకంగా చెప్పారు నాగ్.