మంత్రి పేర్ని నానిని సన్నాసి అంటూ బహిరంగంగా, ఘాటుగా విమర్శించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వైకాపా నేతలను, సిఎమ్ జగన్ ను భయంకరంగా టార్గెట్ చేసారు.
అవును నిజమే వైకాపా ప్రభుత్వం, మంత్రి సన్నాసి అన్న పదానికి అర్హులే. ఎందుకంటే..
గత నెల రోజులుగా ఆంధ్రలో సినిమాలు విడుదలవుతున్నాయి. కొత్త జీవోను తోసి రాజని పాత రేట్లు చాలా చోట్ల అమ్మేస్తున్నారు. ఎమ్మార్వోలను, ఆర్డీవోలను మేనేజ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోంది. బుక్ మై షో లో జీరో రేటు పెట్టి, టికెట్ ను కౌంటర్ లో తీసుకునేలా చేసి, అదనపు రేట్లు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఏం చేయగలిగింది.
నిన్నటికి నిన్న ఉత్తరాంధ్రలోని ఓ మూల జిల్లాలో నూరు శాతం ఆక్యుపెన్సీ చేసినా, టికెట్ రేట్లు చిత్తానికి అమ్మేసినా ప్రభుత్వం, మంత్రి ఏమీ చేయలేకపోయారు. మరి పవన్ కామెంట్ లకు డిజర్వ్ డ్ అని అనుకోవాలా?
అధికారులకు డిస్ట్రిబ్యూటర్లు లంచాలు ఇచ్చేసి, టికెట్ జీవోను తోసి రాజని రేట్లు అమ్ముతుంటే నట్టి కుమార్ లాంటి వాళ్లు కోర్టుకు ఎక్కి, సాక్ష్యాలు చూపిస్తున్నారని తెలిసి కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వుందీ అంటే మరి పవన్ ఇలా అనడం సరైనదేమో?