పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో ఆవేశంగా చేసిన ప్రసంగంలో దొర్లిన ఓ మాట కొత్త విషయాన్ని ప్రస్తావించింది.
సాయి ధరమ్ తేజ్ ఇంకా కోమాలోనే వున్నాడని పవన్ కళ్యాణ్ చెప్పారు. 'సాయి ధరమ్ తేజ్ కోమాలో పడి వున్నాడు కదా' అని ఆయన స్పీచ్ లో అనేసారు. నిజానికి ఇదే విషయం గ్యాసిప్ గా ఇండస్ట్రీలో వినిపిస్తూంది.
మెగా ఫ్యామిలీ ఈ విషయాన్ని గుట్టుగా దాచిందని, మీడియా రాద్దాంతం చేస్తుందని అపోలో ఆసుపత్రి తమకు సంబంధించినదే కావడంతో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై వాస్తవాలు బయటకు రాకుండా చేస్తోందని ఇండస్ట్రీలో గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.
మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు కూడా ఈ విషయాలను ఎప్పటికప్పుడు తమకు పరిచయం వున్న మీడియాతో పంచుకుంటూనే వున్నాయి. అయితే మీడియా సంయమనం పాటిస్తూ ఈ విషయమై వార్తలు రాయకుండా వస్తోంది.
ఇప్పుడు వున్నట్లుండి పవన్ 'తేజు అమాయకుడు కదా, కళ్లు తెరవకుండా ఇంకా కోమాలో పడి వున్నాడు కదా' అని అనేసారు.
ఇప్పుడు కొత్త అనుమానాలకు పవన్ తెర తీసారు.