నాగశౌర్య-మాళవిక నాయర్ జంటగా నటించిన ఫలానా అబ్బాయి..ఫలానా అమ్మాయి సినిమా ట్రయిలర్ వచ్చేసింది. సున్నితమైన భావోద్వేగాలు, ఎంటర్ టైన్ మెంట్ రెండూ కలగలిపి సినిమా చేస్తారని పేరు పడిన అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకుడు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ‘కనుల చాటు మేఘమా’ సాంగ్ బాగా హిట్ అయింది. ముందుగా వినిపిస్తున్నట్లే..ఓ అమ్మాయి..ఓ అబ్బాయి కాలేజీలో కలిసిన దగ్గర నుంచి అమెరికాలో సహజీవనం మీదుగా బ్రేకప్ బ్రేకప్ వరకు ట్రయిలర్ లో ఓ పద్దతిగా సీన్లు పరుచుకున్నాయి.
ట్రయిలర్ లో అవసరాల మార్క్ ఎంటర్ టైన్ మెంట్ ఏమీ లేదు. అయితే ఇది ఆ తరహా సినిమా కాదని, పక్కా ఎమోషన్ల మీద నడుస్తుందని అవసరాలు ముందే క్లారిటీ ఇచ్చేసారు. ట్రయిలర్ మూడు వంతులు ఫీల్ గుడ్ రొమాంటిక్ మూమెంట్స్, స్వీట్ నథింగ్స్ మీద ట్రావెల్ అయింది. చివర్న ఎమోషనల్ టచ్ ఇచ్చారు. అమ్మాయి అడిగినన్నాళ్లూ తన ప్రేమను చెప్పలేని అబ్బాయి..అమ్మాయి దూరమయ్యాక వచ్చే భావోద్వేగం ఏ రేంజ్ లో వుంటుందో అదే రేంజ్ లో చూపించేసారు.
శౌర్య వేరు వేరు ఫేజ్ ల్లో వైవిధ్యంతో బాగున్నాడు. కానీ శౌర్యకు తగినట్లు హీరోయిన్ గెటప్ ల్లో వైవిధ్యం, గ్లామర్ కాస్త మిస్ అయ్యాయి. ట్రయిలర్ కు కళ్యాణ్ మాలిక్ ఇచ్చిన నేపథ్య సంగీతం హాయిగా వుంది. నాలుగేళ్ల పాటు తీసినా, ఎక్కడా కంటిన్యూటీ తేడా కనిపించలేదు. పీపుల్స్ మీడియా నిర్మాణ విలువలు బాగున్నాయి.