పాపం, రానా పుణ్యమా అని విక్టరీ వెంకటేష్ ఒకటి కాదు..రెండు కాదు..మూడు సీజన్లకు లాక్ అయిపోయారట. రానా పట్టుబట్టి మూడు సీజన్లకు అగ్రిమెంట్ చేయంచారని టాలీవుడ్ లో వినిపిస్తోంది. రానా పట్టు పట్టారో లేక వెంకీనే ఒప్పుకున్నారో మొత్తానికి రానా నాయుడు వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ కోసం ఏకంగా మరో రెండు సీజన్లు చేయాల్సిందే.
రానా నాయుడు తొలి సీజన్ పట్ల మూడు వంతులు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇప్పటికే ఇలాంటి చెత్త వెబ్ సిరీస్ లు చూడడం అలవాటైపోయిన వారు, ఫ్యాన్స్ మాత్రం..ఆ ఏముంది..ఇదేమన్నా కొత్తా…అంతగా ఇష్టం లేకపోతే చూడడం మానేయండి..అంతే కానీ మా హీరో చేయడం మానడు అనే విధంగా కామెంట్ చేసుకుంటున్నారు. కానీ సోషల్ మీడియా మెజారిటీ జనాలు మాత్రం రానా నాయుడు లో మరీ అంత నీచమైన, జుగుప్సాకరమైన సీన్లు ఎందుకు బాబూ అని గోల పెడుతున్నారు.
దీంతో వెంకీకి వున్న ఫ్యామిలీ ఇమేజ్ మొత్తం కొట్టుకుపోయింది. మరో రెండు సీజన్లు చేయడం సమస్య కాదు. కానీ ఫస్ట్ సీజన్ లో ఇంత జుగుప్సాకరంగా వుంది అని క్లారిటీ వచ్చేసిన తరువాత ఈసారి వెంకీ వున్నాడు..రానా వున్నాడు అని తెలిసినా తెలుగు ప్రేక్షకులు మాత్రం అటు పొరపాటున కూడా వెళ్లరు. దాంతో దక్షిణాదిన కూడా ఇలాంటి డర్టీ వెబ్ సీరిస్ లను పాపులర్ హీరోలను ఎర చూపించి జనాలకు అలవాటు చేయాలనుకున్న నెట్ ఫ్లిక్స్ ప్లాన్ బెడిసి కొట్టే ప్రమాదం కచ్చితంగా వుంది.