పిల్లల కోసం ప్రభుదేవా భూతం

కొరియోగ్రాఫర్ గా, నటుడిగా, దర్శకుడిగా అనేక విధాలుగా తన టాలెంట్ ప్రదర్శించుకుంటూ వస్తున్నాడు ప్రభుదేవా. లేటెస్ట్ గా కామిక్స్, కార్టూన్ మూవీస్ ఇష్టపడే పిల్లల కోసం ‘మైడియర్ భూతం’ అంటూ ఓ సరదా సినిమా…

కొరియోగ్రాఫర్ గా, నటుడిగా, దర్శకుడిగా అనేక విధాలుగా తన టాలెంట్ ప్రదర్శించుకుంటూ వస్తున్నాడు ప్రభుదేవా. లేటెస్ట్ గా కామిక్స్, కార్టూన్ మూవీస్ ఇష్టపడే పిల్లల కోసం ‘మైడియర్ భూతం’ అంటూ ఓ సరదా సినిమా అందిస్తున్నాడు.  

అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై ఈ సినిమాను నిర్మించారు. తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు.

అల్లావుద్దీన్ అద్భుతదీపం అంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టమైన సబ్జెక్ట్. దాన్నే కాస్త మోడరనైజ్ చేసి, ఓ పిల్లాడితో స్నేహం చేసిన భూతం, దాని చమక్కులు, మ్యాజిక్ లు, గమ్మత్తులు చాలా ఇంటస్ట్రింగ్ గా తయారు చేసి అందిస్తున్నట్లు ట్రయిలర్ చూస్తే అర్థం అయిపోతోంది. 

ట్రయిలర్ కలర్ ఫుల్ గా వుంది. వాడిన కలర్ స్కీమ్ కూడా కొత్తగా వుంది. గ్రాఫిక్స్ రిచ్ గా వున్నాయి. ఇమ్మన్ అందించిన బ్యాక్ గ్రవుండ్ స్కోర్ కూడా ఈ తరహా సినిమాలకు పక్కా పెర్ ఫెక్ట్ అన్నట్లు వుంది.

ఆశీర్వాదం కావాలి

మైడియర్ భూతం ట్రయిలర్ ఆవిష్కరణ సందర్భంగా ప్రభుదేవా మాట్లాడుతూ నన్ను తెలుగు చిత్రపరిశ్రమే పైకి తీసుకొచ్చింది. టీం అంతా చాలా కష్టపడింది. మంచి సినిమా చేశాం. మీ అందరి ఆశీర్వాదం కావాలి. మీ అందరికీ చిత్రం నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. అనంతరం అభిమానుల కోరిక మేరకు ప్రభుదేవా స్టేజ్ మీదే స్టెప్పులు వేసి అందరినీ అలరించారు.

నిర్మాత ఏఎన్ బాలాజీ మాట్లాడుతూ.. ‘రమేష్ పిళ్లై చేస్తోన్న సినిమాలన్నీ బాగుంటాయి. ఇప్పుడు ఆయన దాదాపు పది చిత్రాలు చేస్తున్నారు. ప్రభుదేవాతో సినిమాను నేను చేస్తాను అని అనుకోలేదు’ అన్నారు. డైరెక్టర్ ఎన్. రాఘవన్ మాట్లాడుతూ.. ‘ నేను ఈ స్క్రిప్ట్‌ను ప్రభుదేవా మాస్టర్‌ని దృష్టిలో పెట్టుకునే రాశాను. ఈ సినిమా కోసం ప్రభుదేవా గారు 45 రోజులు కష్టపడ్డారు. ఆ కష్టం మీకు తెరపై కనిపిస్తుంది’ అని అన్నారు.