పెళ్లి పరమార్థం ఏమిటి? కేవలం శారీరక సుఖమే కాదు ఆవిర్భవించడానికి అంకురార్పణ అక్కడే కదా? కానీ సినిమా రంగంలో ఓ దర్శకుడు ఐడియాలజీ వేరుగా వుంది. అసలు పిల్లలను కనడమే వద్దనుకుంటున్నాడట.
ఆఫ్ కోర్స్ అలాంటి వాళ్లు చాలా మందే వుంటారు కదా? అని అనుకోవచ్చు. కానీ దర్శకుడి సంగతి వేరు. ఆర్జీవీ ఐడియాలజీ ఏమైనా పుణికి పుచ్చుకున్నాడేమో? పిల్లల్ని కనడం, పెంచడం అంతా దండుగ వ్యవహారం అంటున్నాడట. అవును ముమ్మాటికీ ఇలాగే ఆలోచిస్తున్నాడట ఓ మాస్ డైరక్టర్.
పిల్లల్ని కంటే పెంచాలి. అందుకోసం బోలెడు ఖర్చు చేయాలి. అలా చేసిన ఖర్చుకు రిటర్న్ అంటూ ఏమీ వుండదు. వాళ్లేమీ మనని చూడరు. వాళ్లకు రెక్కలు వచ్చాక వాళ్ల మానాన వాళ్లు వెళ్లిపోతారు. ఈ మాత్రం దానికి వాళ్లను కనడం ఎందుకు? పెంచడం ఎందుకు? ఖర్చు చేయడం ఎందుకు అంటున్నాడట సన్నిహితులతో. అందుకే ఇప్పటి వరకు పిల్లలు లేరు ఆ దర్శకుడికి. పిల్లలు లేరు అంటే టైమ్ తీసుకుని కంటారేమో అనుకున్నారంతా?
కానీ అది కాదు రీజన్ అంట…అసలు రీజన్ పిల్లల్ని కనడం డబ్బుల దండుగ వ్యవహారం అని అనుకోవడం అంట. ఒక విధంగా ఆలోచిస్తే సదరు దర్శకుడు ఆలోచన కరెక్టె అనిపిస్తుంది కానీ మరీ ఇలా ప్రతీదీ డబ్బులు లెక్క పెట్టి చేయడం అన్నది సబబు కాదేమో? అయినా సినిమాల్లో బంధాలు, అనుబంధాలు అని ఎమోషన్లు తెరకెక్కించే దర్శకులు ఇలా ఆలోచిస్తారా? తెరవెనుక?