Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ హీరోకు 'పాన్ ఇండియా' పిచ్చి పట్టింది?

ఆ హీరోకు 'పాన్ ఇండియా' పిచ్చి పట్టింది?

మంచి కథ, సరిగ్గా సరిపోతాడు. హీరో మాత్రం నో చెప్పేశాడు. 'అబ్బే.. ఇప్పుడిలాంటి స్టోరీలు చేయడం లేదండి' అనేది సమాధానం. ఇలాంటిదే మరో మంచి స్టోరీ. లవ్, కామెడీ, ఫ్యామిలీ సబ్జెక్ట్. మంచి సెటప్ కూడా కుదిరింది. పైగా ఈ జానర్ లో సదరు హీరోకు గతంలో హిట్స్ కూడా ఉన్నాయి. కానీ నో చెప్పేశాడు. గట్టిగా అడిగితే పాన్ ఇండియా సబ్జెక్ట్ కాదంటున్నాడు.

అవును.. ఈ హీరోకు పాన్ ఇండియా పిచ్చి పట్టింది. తన సినిమా అన్ని రాష్ట్రాల్లో ఆడాలని, తనకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావాలని ఆరాటపడుతున్నాడు. ఇలా ఆశ పడడంతో తప్పులేదు కానీ, మూలాల్ని మరిచిపోతున్నాడు. అక్కడే వచ్చింది అసలు సమస్య.

అతడికి బాయ్ నెక్ట్స్ డోర్ అనే ఇమేజ్ ఉంది. హిట్లు కూడా అందుకే వచ్చాయి. ఎప్పుడైతే అది వదిలి మాస్ బాట పట్టాడో ఫ్లాపులు ఎదురయ్యాయి. ఇప్పుడీ మాస్ అప్పీల్ కు తోడు పాన్ ఇండియా కనెక్ట్ అంటున్నాడు. ఏం జరుగుతుందో చూడాలి.

ఇతగాడి కంటే ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఓ హీరో రీసెంట్ గా ఓ పాన్ ఇండియా సినిమా చేశాడు. సినిమా డిజాస్టర్ అయినా, అతడికి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చేసింది. దీంతో మన హీరోకు కూడా పాన్ ఇండియాలో ఏదో చేయాలనే ఆశ పుట్టింది. అందుకే తన మార్కెట్ ను మించి నిర్మాతతో ఖర్చు చేయిస్తున్నాడు.

ఆల్రెడీ ఓ కాస్ట్ ఫెయిల్యూర్ మూవీ ఖాతాలో ఉన్నప్పటికీ ఈ విషయంలో సదరు హీరో తగ్గడం లేదు. ప్రస్తుతం ఓ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో చెక్కుతున్నాడు. నెక్ట్స్ మూవీ కోసం కూడా అలాంటి సెటప్ నే కోరుకుంటున్నాడు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?