ఆదిపురుష్ విడుదల తేదీ మారిపోయింది. ఆ ప్రభావం ప్రభాస్ నటిస్తున్న మిగతా సినిమాలపై పడింది. ఆదిపురుష్ వాయిదాతో, ప్రభాస్ నటిస్తున్న మిగతా సినిమాలన్నీ దాదాపు వాయిదా పడే పరిస్థితికి వచ్చాయి.
ఆదిపురుష్ సినిమాను జూన్ 16కు వాయిదా వేశారు. ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా సలార్ ను సెప్టెంబర్ లో విడుదల చేయాలనుకున్నారు. ఆదిపురుష్ జూన్ కు వచ్చింది కాబట్టి, ప్రాక్టికల్ గా సలార్ సినిమాను సెప్టెంబర్ లో విడుదల చేయడం సాధ్యం కాదు.
సలార్ లాంటి పాన్ ఇండియా సినిమాను రిలీజ్ చేయాలంటే కనీసం 3 నెలల ముందు నుంచి ప్రచారం ప్రారంభించాల్సి ఉంటుంది. ఆదిపురుష్ థియేటర్లలో ఉన్న టైమ్ లో సలార్ ప్రమోషన్ ను ముందుకు తీసుకెళ్లలేరు. ఇదొక అడ్డంకి. ఇక రెండో అడ్డంకి ఏంటంటే.. ఆదిపురుష్ ప్రచారం కోసం ప్రభాస్ టైమ్ కేటాయించాల్సి ఉంటుంది. ఆ వెంటనే సలార్ ప్రచారమంటే ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే పని కాదు.
సో.. సలార్ కూడా దాదాపు వాయిదాపడినట్టే. అదే కనుక జరిగితే ప్రభాస్ ఇతర సినిమాలు కూడా అనుకున్న తేదీ కంటే కాస్త లేటుగా థియేటర్లలోకి రావడం ఖాయం.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టు-కె అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్. అటు మారుతి దర్శకత్వంలో సినిమాను పట్టాలపైకి తీసుకొచ్చాడు. మరోవైపు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాను కూడా స్టార్ట్ చేయాల్సి ఉంది.