పూజ అలా..శ్రీలీల ఇలా

టైమ్..బాబూ..టైమ్. క్రేజ్ వుంటే ఫుల్ బిజీగా వుంటారు హీరోయిన్లు. ఏ హీరో చూసినా ఆ హీరోయిన్ నే కావాలంటారు. ఏ డైరెక్టర్ చూసినా ఆ హీరోయిన్ నే కావాలంటారు. అలాంటి ఫేజ్ లో వుంది…

టైమ్..బాబూ..టైమ్. క్రేజ్ వుంటే ఫుల్ బిజీగా వుంటారు హీరోయిన్లు. ఏ హీరో చూసినా ఆ హీరోయిన్ నే కావాలంటారు. ఏ డైరెక్టర్ చూసినా ఆ హీరోయిన్ నే కావాలంటారు. అలాంటి ఫేజ్ లో వుంది శ్రీలీల ఇప్పుడు. 

ఏ సినిమా చూసినా శ్రీలీలే. ఏ హీరో పక్కన అయినా శ్రీలీల నే. పవన్ కళ్యాణ్ పక్కన శ్రీలీల..మహేష్ బాబు పక్కన శ్రీలీల.. బాలయ్య సినిమాలో శ్రీలీల… వైష్ణవ్ తేజ్, నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండ..వీళ్ల పక్కన కూడా శ్రీలీల.  ఇంకా మరో ఒకటి రెండు సినిమాలు కూడా డిస్కషన్లో వున్నాయి.

ఈ జాబితాలో దాదాపు ఒకటి తప్పిస్తే మిగిలిన సినిమాలు అన్నీ సితార సంస్థలోనే. హీరోల డేట్ లు బట్టి షూటింగ్ కాదు ఇప్పుడు. శ్రీలీల డేట్ లు బట్టి షూటింగ్ లు ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ మధ్య ఓ సినిమా ఆదివారం నాడు షూట్ చేసారు. సాధారణంగా ఆదివారం ఎక్కువగా షూటింగ్ లు వుండవు. కానీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ఆ రోజు శ్రీలీల డేట్ లు ఇచ్చింది. మరో సినిమా నైట్ షూట్ పెట్టుకున్నారు. ఎందుకూ అంటే శ్రీలీల కాల్ షీట్లు దొరకుతాయని.

అలా వుంది శ్రీలీల క్రేజ్. కానీ అదే టైమ్ లో పూజా హెగ్డే పరిస్థితి రివర్స్ లో వుంది. టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే చేతిలో ఇప్పుడు ఒకే ఒక్క సినిమా వుంది. మహేష్ బాబు సినిమా. థాంక్స్ టు గురూజీ త్రివిక్రమ్. ఆయన పట్టు పట్టకపోతే మహేష్ సరసన పూజా వుండేది కాదు అన్న టాక్ వుండనే వుంది. కానీ ఆ షూట్ కూడా ప్రస్తుతం జరగడం లేదు. అందువల్ల ప్రస్తుతం పూజా ఖాళీగా వుండాల్సి వచ్చింది.