Advertisement

Advertisement


Home > Movies - Movie News

కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంటే ఇలానే ఉంటుంది!

కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంటే ఇలానే ఉంటుంది!

ప్రస్తుతం పూజాహెగ్డే కెరీర్ పీక్ స్టేజ్ లో పరుగులుపెడుతోంది. ఇలాంటి టైమ్ లో పుట్టినరోజు వస్తే ఇంకేముంది? టోటల్ ఇండస్ట్రీ అంతా సెలబ్రేట్ చేస్తుంది. మరీ ముఖ్యంగా ఆమె నటించిన సినిమా యూనిట్లు దాన్ని కూడా తమ ప్రమోషన్లకు వాడుకుంటాయి. ఈరోజు అదే జరిగింది.

ఆచార్య సినిమాలో నీలాంబరిగా కనిపించబోతోంది పూజా హెగ్డే. ఇక రాధేశ్యామ్ లో ప్రేరణగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో విభాగా కనిపించనుంది. ఈ మూడు పాత్రలకు సంబంధించిన స్టిల్స్ తో సదరు సినిమా యూనిట్లు ఈరోజు పోస్టర్లు రిలీజ్ చేశాయి. పూజా హెగ్డేకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాయి.

హ్యాపీ బర్త్ డే ప్రేరణ అంటూ రాధేశ్యామ్ సినిమా నుంచి పూజా హెగ్డే స్టిల్ ను స్వయంగా ప్రభాస్ రిలీజ్ చేశాడు. ఇక కొణెదల ప్రొడక్షన్ కంపెనీ నుంచి ఆచార్య, గీతాఆర్ట్స్-2 బ్యానర్ నుంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పోస్టర్లు చకచకా రిలీజయ్యాయి.

అటు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఓ రేంజ్ లో సందడి నడుస్తోంది. తమిళనాట విజయ్ సరసన బీస్ట్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది పూజా హెగ్డే. ఇక హిందీలో కూడా చేతిలో 2 సినిమాలున్నాయి. దీంతో ఆ ఇండస్ట్రీస్ నుంచి కూడా పూజాహెగ్డేకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు పుట్టినరోజు జరుపుకుంటే ఆ కిక్కే వేరు. ఈరోజు అలాంటి కిక్ నే ఎంజాయ్ చేస్తోంది ''బిజీ'' హెగ్డే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?