cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఫస్ట్ టైమ్ ఖాకీ డ్రెస్ లో ప్రభాస్?

ఫస్ట్ టైమ్ ఖాకీ డ్రెస్ లో ప్రభాస్?

సిల్వర్ స్క్రీన్ పై ఫుల్ లెంగ్త్ లో ప్రభాస్ ను ఖాకీ డ్రెస్ లో చూడాలని అతడి ఫ్యాన్స్ కోరుకోవడం సహజం. పోలీస్ యూనిఫామ్ లో ఓ సినిమా చేయమంటూ గతంలోనే అభిమానుల నుంచి ప్రభాస్ కు చాలా విజ్ఞప్తులు అందాయి. ఇన్నాళ్లకు ప్రభాస్ అభిమానుల కోరిక తీరబోతోంది. త్వరలోనే పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు యంగ్ రెబల్ స్టార్.

రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాను ప్రకటించాడు ప్రభాస్. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ లేదా సూపర్ కాప్ గా ప్రభాస్ కనిపించబోతున్నాడట. సినిమాలో కొన్ని చోట్ల పోలీస్ యూనిఫామ్ లో కనిపిస్తాడని టాక్. ప్రభాస్ కు ఇది ప్రతిష్టాత్మక 25వ చిత్రం.

సాహో సినిమాలో ఓ షేడ్ లో ఏజెంట్ గా కనిపిస్తాడు ప్రభాస్. ఏక్ నిరంజన్ లో పోలీసులకు సహకరించే బాంటీ హంటర్ గా నటించాడు. కానీ ఇప్పటివరకు ఖాకీ చొక్కా మాత్రం వేసుకోలేదు. ఆ ముచ్చట స్పిరిట్ తో తీరబోతోందని సమాచారం.

స్పిరిట్ లో ప్రభాస్ పాత్రపై ప్రస్తుతానికైతే అధికారిక సమాచారం లేదు. అయితే ప్రభాస్ ఫ్యాన్ పేజీల్లో మాత్రం అతడి పాత్ర ఇదేనంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది. దీన్ని ప్రభాస్ పీఆర్ టీమ్ కూడా ఖండించకపోవడం విశేషం. 

చిరంజీవి వర్గం వారి తెలివితక్కువతనమే

పెదరాయుడిని ఎదుర్కోలేని ముఠామేస్త్రీ

 


×