వరుసగా రెండు సినిమాల్లో ఛాన్స్ ఇచ్చాడు. ఆమె యాక్టింగ్ స్కిల్స్ ను, నిబద్ధతను తెగ మెచ్చుకున్నాడు. దీంతో ముచ్చటగా మూడోసారి కూడా పూజాకు ఛాన్స్ ఇస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఈసారి పూజాను పక్కనపెట్టాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాలో పూజా హెగ్డే లేదు.
అరవింద సమేత సినిమాతో త్రివిక్రమ్-పూజా హెగ్డే కలిశారు. ఆ సినిమా టైమ్ లోనే పూజా హెగ్డే, త్రివిక్రమ్ కు తెగ నచ్చేసింది. అందుకే ఆమెతో సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పించాడు. ఆ వెంటనే అల వైకుంఠపురములో సినిమాలో కూడా ఛాన్స్ ఇచ్చాడు. పూజా కాళ్లను సెక్సీగా చూపించడమే కాకుండా, ఆమెను ఏకంగా బుట్టబొమ్మను చేసి తన ఇష్టాన్ని చాటుకున్నాడు.
ఇంత చేసిన త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో చేయబోయే నెక్ట్స్ సినిమాలో కూడా పూజానే రిపీట్ చేస్తాడని ఎవరైనా అనుకుంటారు. కానీ ఆల్రెడీ పూజాతో కలిసి నటించిన ఎన్టీఆర్, వెంటనే ఆమెతో మరో సినిమా చేస్తే ఫ్రెన్ నెస్ ఉండదని భావించినట్టున్నాడు. అందుకే ఈసారి పూజా హెగ్డే స్థానంలో రష్మికను తీసుకున్నారు.
త్రివిక్రమ్, రష్మిక కాంబినేషన్ లో ఇదే మొదటి సినిమా. పూజా హెగ్డేను బుట్టబొమ్మగా చూపించిన త్రివిక్రమ్, ఈసారి ఈ కన్నడ కస్తూరిని ఇంకెంత అందంగా చూపిస్తాడో చూడాలి. అన్నట్టు ఈ సినిమాకు రష్మికను తీసుకున్న విషయాన్ని ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు. కానీ దాదాపు ఫిక్స్.