పూజా హెగ్డేకు ఇప్పుడు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఉన్న అవకాశాల్నే ఆమె జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేతిలో ఉన్న ప్రతి సినిమాతో ఆమె సక్సెస్ కొట్టాలి. లేదంటే కెరీర్ కష్టం. ఈ క్రమంలో ఆల్రెడీ ఓ లైఫ్ లైన్ ను చేజార్చుకుంది ఈ హీరోయిన్.
సూర్యతో కలిసి చేసిన రెట్రో సినిమా కచ్చితంగా హిట్టవుతుందని, అలా మరోసారి కెరీర్ లో పీక్ స్టేజ్ కు వెళ్లొచ్చని ఆశపడింది పూజాహెగ్డే. కానీ రెట్రో సినిమాకు సరైన ఆదరణ దక్కలేదు. కోలీవుడ్ లో మంచి ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా, వీకెండ్ తర్వాత నిలదొక్కుకోవడం కష్టం అంటున్నారు.
ఇటు టాలీవుడ్ లో మొదటి రోజే ఈ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో పూజాహెగ్డే టాలీవుడ్ కలలకు బ్రేక్ పడింది. ఇప్పటికే ఆమెకు ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. రెట్రో సినిమాతో ఆ ఇమేజ్ మరింత ముందుకెళ్లింది.
చివరికి మీడియా కూడా ఇదే విషయాన్ని మేకర్స్ ను బాహాటంగా అడిగేసింది. అలాంటిదేం లేదని మేకర్స్ కొట్టి పారేసినా, జనం మాత్రం పూజాహెగ్డే విషయంలో ఓ అభిప్రాయానికొచ్చేశారు.
రెట్రో రిజల్ట్ తో పూజాహెగ్డేకు అవకాశాలు మరింత తగ్గిపోయాయి. అయితే ఆమెకింకా కెరీర్ లో లైఫ్ లైన్స్ మిగిలున్నాయి. ఆమె చేతిలో విజయ్ సినిమా ఉంది. ఇటు తెలుగులో మాత్రం పూజాకు దాదాపు తలుపులు మూసుకున్నట్టే.
eemeku acting raadu.skin show tappa.iron leg mudra anavasarm.ameki vachina cinemale alaga unnai papam+