Advertisement

Advertisement


Home > Movies - Movie News

పూజా హెగ్డే 'కన్నడ' ప్రేమ

పూజా హెగ్డే 'కన్నడ' ప్రేమ

బాలీవుడ్ లో అరంగేట్రం చేసి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ పొజిషన్ కు చేరుకుంది పూజా హెగ్డే. ఇప్పుడు కోలీవుడ్ పై కూడా కన్నేసింది. అయితే ఆమె ఈ 3 ప్రాంతాలకు చెందిన వ్యక్తి కాదు. పూజా హెగ్డేది కర్నాటక. ఇదే విషయంపై ఆమెను ప్రశ్నిస్తే, ఆసక్తికర సమాధానం ఇచ్చింది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లో తను పాపులర్ అయినప్పటికీ కర్నాటక అమ్మాయి అనిపించుకోవడమే తనకు ఇష్టం అని చెప్పుకొచ్చింది.

"నా మూలాల్ని నేను ఎప్పుడూ ప్రేమిస్తాను. కర్నాటక, మంగుళూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గర్విస్తాను. నేను ముంబయిలో పుట్టిపెరిగినప్పటికీ, కన్నడ అమ్మాయి అనిపించుకోవడానికే ఎక్కువ ఇష్టపడతాను. కన్నడ నీళ్లలో ఏదో ఉంది, అందమైన అమ్మాయిలంతా అక్కడ్నుంచే వస్తున్నారని చాలామంది నాతో అంటుంటారు. ఆ మాట విన్నప్పుడు గర్వంగా అనిపిస్తుంది."

ఈ సందర్భంగా కన్నడ చిత్రసీమపై ప్రేమను కురిపించింది పూజా హెగ్డే. శాండిల్ వుడ్ నుంచి మంచి ఆఫర్లు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.

"కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో భాగం అవ్వాలనుకుంటున్నాను. శాండిల్ వుడ్ నుంచి మంచి స్క్రిప్టులు, ఆఫర్లు వస్తే చేయాలనుకుంటున్నాను. నేను చెప్పేది కన్నడ చిత్రసీమకు చేరాలని అనుకుంటున్నాను. కన్నడలో నటించడానికి నేను రెడీ."

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. ఇలాంటి టైమ్ లో కన్నడ నుంచి మంచి ఆఫర్ వచ్చినా ఆమె నటించే అవకాశాలు తక్కువ. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?