బన్నీకి బాస్.. సినిమాలో కొత్త యాంగిల్

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న అల వైకుంఠపురములో సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర ఏంటనేది మచ్చుకు బయటకు వచ్చింది. అవును.. మూవీలో బన్నీకి బాస్ గా…

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న అల వైకుంఠపురములో సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర ఏంటనేది మచ్చుకు బయటకు వచ్చింది. అవును.. మూవీలో బన్నీకి బాస్ గా పూజా హెగ్డే కనిపించనుంది. ఓ కార్పొరేట్ కంపెనీలో పూజా-బన్నీ పనిచేస్తారు. ఆఫీస్ లో బన్నీకి బాస్ గా పూజా హెగ్డే కనిపించబోతోంది.

ఈ విషయాల్ని స్వయంగా పూజా హెగ్డే బయటపెట్టింది. సినిమాలో తనకు, బన్నీకి మధ్య వచ్చే లవ్ ట్రాక్ హైలైట్ గా నిలుస్తుందని చెబుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ పారిస్ లో జరుగుతోంది. ఫ్రాన్స్ లోని కొన్ని అందమైన లొకేషన్లలో సామజవరగమన పాటను షూట్ చేస్తున్నారు. ఆడియో పరంగా బ్లాక్ బస్టర్ అయిన ఈ పాట.. విజువల్ గా కూడా ఆకట్టుకుంటుందని చెబుతోంది పూజా.

అల వైకుంఠపురములో సినిమాకు సంబంధించి పాటలు, స్టిల్స్ బయటకొస్తున్నాయి కానీ కథ ఎలా ఉండబోతోంది, పాత్రలు ఏంటనే విషయంపై ఇప్పటివరకు  ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. కనీసం లీక్స్ కూడా లేవు. ఫస్ట్ టైమ్ పూజా హెగ్డే ఇలా సినిమాకు సంబంధించిన కీలకమైన ఎలిమెంట్ ను బయటపెట్టింది.

సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్, గీతాఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. త్రివిక్రమ్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను జనవరి 12న థియేటర్లలోకి తీసుకొస్తారు.