పూజా..లెగ్స్ బ్యూటీ

అల వైకుంఠపురములో తన కాళ్లతోనే హీరో అల్లు అర్జున్ ను కట్టి పడేసి, కాళ్ల మీద నుంచి కళ్లు తిప్పుకోకుండా చేసేసింది హీరోయిన పూజా హెగ్డే. ఆమె కాళ్ల సౌందర్యం అలాంటిది మరి. ఈ…

అల వైకుంఠపురములో తన కాళ్లతోనే హీరో అల్లు అర్జున్ ను కట్టి పడేసి, కాళ్ల మీద నుంచి కళ్లు తిప్పుకోకుండా చేసేసింది హీరోయిన పూజా హెగ్డే. ఆమె కాళ్ల సౌందర్యం అలాంటిది మరి. ఈ సంగతి త్రివిక్రమ్ కే కాదు మిగిలిన దర్శకులకు కూడా అర్థమైపోయినట్లుంది. అందుకే రాబోయే సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లొ కూడా పూజా కాళ్ల సౌందర్యాన్ని సినిమా అభిమానుల కళ్లకు కట్టేలే ప్రదర్శించే పని పెట్టుకున్నారు.

అఖిల్ హీరోగా, బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో బన్నీ వాస్ తన జిఎ 2 పతాకంపై నిర్మిస్తున్న ఈసినిమా డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ను ఈ రోజు విడుదల చేసారు. సంక్రాంతి 2021 విడుదల అంటూ విడుదల చేసిన పోస్టర్ లో, పూజా చిన్న షార్ట్ తో కుర్చీలో కూర్చుని, తన తొడలు, కాళ్ల సౌందర్యాన్ని వయ్యారంగా ఆరబోసింది. 

కాలుతో అఖిల్ చెవిని టచ్ చేస్తూ కూర్చున్న భంగిమ కొన్నాళ్ల పాటు కుర్రాళ్ల మనసుల్ని కెలికేస్తుంది. అందులో అస్సలు డౌటే లేదు. ఈ సినిమాలో పూజా స్టాండింగ్ కామెడీ చేసే అమ్మడుగా కనిపించబోతోంది.

2021 సంక్రాంతికి ఇప్పటికే నితిన్ రంగ్ దే సినిమా ప్రకటించారు. అఖిల్ సినిమా రెండోది. ఇది కాక శర్వానంద్ శ్రీకారం కూడా సంక్రాంతికే అని వినిపిస్తోంది.

పేషేంట్లకి బెడ్ ఇవ్వలేకపోతే మనం మనుషులమే కాదు