Advertisement

Advertisement


Home > Politics - Gossip

గంటాకు గేట్లు మూసేసినట్లేనా?

గంటాకు గేట్లు మూసేసినట్లేనా?

వైకాపా కీలక నేత విజయసాయి రెడ్డి ఆసుపత్రిలో వున్న టైమ్ లో, తెలుగుదేశం పార్టీ విశాఖ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైకాపా ఎంట్రీ ఖాయమైందంటూ వున్నట్లుండి వార్తలు తెరపైకి వచ్చాయి.  అటు తెలుగుదేశం నాయకులు దీన్ని ఖండించలేదు. ఇటు గంటా కూడా నో అని అనలేదు. దీంతో గంటా వైకాపా ఎంట్రీ పక్కా అయిపోయిందని అంతా ఫిక్స్ అయిపోయారు.

అదే సమయంలో గంటా ఎంట్రీ వైకాపాలో కలకలం రేపింది. ప్రశాంతగా వున్న విశాఖ వైకాపా లో గంటా ఎంట్రీ వర్గాలకు, విబేధాలకు దారితీస్తుందని పెద్దగా కథనాలు వచ్చాయి. మరి ఇవన్నీ అధిష్టానం దృష్టికి వెళ్లాయో, లేక ఇలాంటి వాతావరణంలోకి వెళ్లడం అనవసరం అని గంటా అనుకున్నారో, లేక వైకాపా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదో, మొత్తానికి గంటా ఎంట్రీ ఎక్కడిదక్కడే ఆగిపోయింది.

విశాఖ మీద పట్టుకోల్పోవడం ఇష్టం లేని ఓ సామాజిక వర్గం తమ తరపును తరుపు ముక్కగా గంటాను వైకాపాలోకి పంపుతోందన్న ఊహాగానాలు వినిపించాయి. సాధారణంగా కీలక నేతలు వెళ్లిపోతుంటే పార్టీ అధిష్టానం చకచకా రంగంలోకి దిగి, క్రైసిస్ మేనేజర్లను పంపి, బుజ్జగించే ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అలాంటి ప్రయత్నాలు ఏవీ చేసిన దాఖలాలు వార్తల్లో కనిపించలేదు.. అంటే ఓ సామాజిక వర్గం కావాలనే కోవర్ట్ మాదిరిగా గంటాను వైకాపాలోకి పంపుతోందన్న గ్యాసిప్ లకు మరింత బలం చేకూరింది.

ఇలాంటి నేపథ్యంలో ఒక్క రోజు వినిపించిన వార్తలు మర్నాడు మళ్లీ వినిపించలేదు. సందడి మొత్తం సద్దుమణిగింది. విజయసాయికి ఇబ్బంది కలిగించడానికే మంత్రి బొత్స సత్యనారాయణ ఇలాంటి కార్యక్రమానికి తెరవెనుక వుండి ఆజ్యం పోసారని కూడా గ్యాసిప్ లు వచ్చాయి. ఇలాంటి రకరకాల గ్యాసిప్ ల నేపథ్యంలో ప్రస్తుతానికి గంటా ఎంట్రీకి తాత్కాలికంగా గేట్లు మూసినట్లు వినిపిస్తోంది. ఇక నియర్ ఫ్యూచర్ లో గంటా చప్పుడు వైకాపాలో వినిపించకపోవచ్చు.

పేషేంట్లకి బెడ్ ఇవ్వలేకపోతే మనం మనుషులమే కాదు

త‌ప్పంతా నాదే...రోజా నాకు అక్క లాంటిది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?