అఖిల్ అక్కినేని-పూజా హెగ్డే కాంబినేషన్ లో బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో తయారవుతున్న సినిమా బ్యాచులర్. ఈ సినిమా నుంచి సిద్ శ్రీరామ్ పాడిన లెహరాయి..లెహరాయి అనే పాటను విడుదల చేసారు.
ఇమ్మీడియట్ చార్ట్ బస్టర్ గా వుంది సాంగ్. సాంగ్ ఎంత బాగుంది అన్న సంగతి పక్కన పెడితే పూజ-అఖిల్ ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది.
పూజా హెగ్డే ఇప్పటి వరకు ఫార్టీస్ దాటిన వారు, ముఫై లు దాటిన వారే హీరోలుగా నటించారు. పూజ కన్నా చిన్నవాళ్లు, రియల్ యంగ్ హీరోలు ఆమె పక్కన చేయలేదు. 31 ఏళ్ల పూజ పక్కన 27 ఏళ్ల అఖిల్ నటించడంతో ఆమె కూడా చాలా హుషారుగా వున్నట్లు కనిపించింది. ఇద్దరి కెమిస్ట్రీ అంత యూత్ ఫుల్ గా వుంది.
అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమా దసరా టైమ్ లో థియేటర్లలోకి వస్తోంది. గోపీసుందర్ దర్శకుడు.