ఆర్జీవీ పై పూనమ్ కౌర్ ట్వీట్లు

ఆర్జీవీ తెరతీసిన పవర్ స్టార్ సినిమా ట్వీట్ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. ఆర్జీవీ పేరు ఎత్తకుండానే హీరోయిన్ పూనమ్ కౌర్ వేసిన రెండు ట్వీట్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ట్వీట్…

ఆర్జీవీ తెరతీసిన పవర్ స్టార్ సినిమా ట్వీట్ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. ఆర్జీవీ పేరు ఎత్తకుండానే హీరోయిన్ పూనమ్ కౌర్ వేసిన రెండు ట్వీట్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ట్వీట్ లు వేయమని పూనమ్ కౌర్ ను ఆర్జీవీ బ్రయిన్ వాష్ చేసారా? ఆయన ట్వీట్ లు తయారుచేసి  పంపారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఆర్జీవీ పవర్ స్టార్ సినిమా తీస్తాను, అందులో పాత్రలు ఇవీ అంటూ ట్వీట్ వేయడంతో, ఆర్జీవీ అనే మరో పాత్రను కూడా జోడించమని అంటూ త్రివిక్రమ్ సినిమాలోలా చెప్పీ చెప్పనట్లు, చూపించీ చూపించనట్లు ట్వీట్లు వేసింది పూనమ్ కౌర్.

Plz include a character named #rgv who calls girls finding out their emotional weakness n instigates them to use abusive language and sends tweets to them to share as if they are doing it n then informs media  about it …I respected U when I was a child …feel sad about u now
….
I really wish I had recorded the call of this traitor director who brainwashed me for an hour to speak against a personality …the tweets he sent me were sent to respective party personal …thank god I have few genuine people in media I wouldn’t know ur intentions otherwise …
….
పేరు పెట్టకున్నా కాస్త గట్టి ఆరోపణలే చేసింది పూనమ్ కౌర్. సాధారణంగా ఆర్జీవీ ఊరుకోరు. కౌంటర్ ఇస్తారు. ఇప్పుడు ఈ ట్వీట్లు చూసాక ఏమంటారో? కొంపదీసి పికె అనే కొత్త పాత్రను కూడా జోడిస్తా అంటూ ట్వీట్ వేస్తారో? చూడాలి.

'పీవీ'ని ఆకాశానికి ఎత్తేసిన కెసిఆర్

జగన్ గారిని ఫాలో అవ్వక తప్పదు