ప్రముఖ సినీనటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి కరోనా బారినపడ్డారు. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. సినిమా ఘాటింగ్ లో భాగంగా పుణె వెళ్లిన ఆయన నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలోనే కరోనా లక్షణాలు ఉండటంతో టెస్ట్ చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ గా తేలింది. కాగా పోసానికి కోవిడ్ బారినపడటం ఇది మూడోసారని తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా నేపథ్యంలో నిన్న తెలంగాణలో 45 కరోనా కేసులు నమోదు కాగా.. హైదారాబాద్ లోనే 18 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే దేశంలో వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య చెప్పుకోదగిన స్థాయిలో నమోదు అవుతూ ఉంది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య మరో పది-పన్నెండు రోజుల్లో పతాక స్థాయికి చేరుతుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. కోవిడ్ ఈ వేవ్ లో మరో పన్నెండు రోజుల్లోనే పతాక స్థాయికి చేరి, ఆ వెంటనే తగ్గుముఖం పడుతుందని అంచనాలు వేసింది. రానున్న పది పన్నెండు రోజులూ చాలా కీలకం అని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తూ ఉన్నాయి. మాస్కులు ధరించడం, జనసమూహాల్లోకి వెళ్లకపోవడం మంచిదని ప్రభుత్వాలు సూచిస్తూ ఉన్నాయి.