లాక్ డౌన్ టైమ్ లో చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబు లాంటి కొంతమంది ప్రముఖులు తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిగిన సంగతి తెలిసిందే. దానిపై అప్పట్లో నటుడు బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాళ్లంతా భూములు పంచుకోవడం కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రభుత్వాన్ని కలుస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. కొన్నాళ్లకు ఆ వివాదం సద్దుమణిగింది.
అలా సైలెంట్ అయిన వివాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు నటుడు పోసాని. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూనే, తనదైన శైలిలో స్పందించారు. కోట్లకు పడగలెత్తిన చిరంజీవి, నాగార్జున లాంటి హీరోలకు భూములు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు పోసాని.
“బాలయ్య చేసిన రియల్ ఎస్టేట్ కామెంట్స్ పై నాలాంటి వాడు స్పందించకపోతేనే మంచిది. ఎందుకంటే.. నేను ఎలా మాట్లాడతానో అందరికీ తెలుసు. కాకపోతే కాస్త చిన్నగా చెబుతా. అప్పట్లో ఎవరైతే తెలంగాణ ప్రభుత్వం దగ్గరకు వెళ్లి వచ్చారో వాళ్లంతా ఆల్రెడీ డబ్బు-పేరు ఉన్న వాళ్లే. అంతా కోటీశ్వరులే. ఓ 2 ఎకరాల భూమి కోసం వెళ్లి ప్రభుత్వం కాళ్లు పట్టుకునే స్థితిలో నాగార్జున, చిరంజీవి లాంటి వాళ్లు ఉన్నారా?”
మరోవైపు సినిమా జనాల పొలిటికల్ ఎంట్రీలపై కూడా పోసాని స్పందించారు. సినిమా వాళ్లకు ఇప్పుడు రాజకీయాల్లో స్కోప్ లేదన్నారు. తనకు కూడా వ్యక్తిగతంగా రాజకీయాలపై ఆసక్తి లేదని, అందుకే ముఖ్యమంత్రి జగన్ తనకు పదవులు ఆఫర్ చేసినప్పటికీ తిరస్కరించానని చెప్పుకొచ్చారు పోసాని.