దాదాపు అయిదారేళ్లుగా ఓ పాతకారునే వాడుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనసు మార్చుకున్నారు.
ఓ కొత్త కారు కొనాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఓ కొత్త కారును బుక్ చేసినట్లు బోగట్టా. కారు ఆయన పేరునే బుక్ అయింది కాబట్టి, ఆయన కోసమే అనుకోవాల్సిందే.
అతి తక్కువ మంది సెలబ్రిటీలు వాడే రేంజ్ రోవర్ కంపెనీ ఆటోబయోగ్రఫీ మోడల్ కారును పవన్ కళ్యాణ్ కొనుగోలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. 3.0 ఇంజన్ స్పోర్ట్స్ యుటిలిటి మోడల్ కారు చాలా అందంగా వుంటుంది. ఖరీదు నాలుగు కోట్లకు పైగానే అని తెలుస్తోంది.
మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక పవన్ చకచకా వర్క్ చేస్తున్నారు. దాదాపు అయిదు సినిమాలు ఓకె చేసినట్లు తెలుస్తోంది.
ప్రతి సినిమాకు కనీసం 50 కోట్ల రెమ్యూనిరేషన్ వుంటుంది. అందువల్ల నాలుగు కోట్ల కారు కొనడం అన్నది పెద్ద విశేషం కాదు. కొత్త కారు కొంటున్నారన్నదే పాయింటు.