పవర్ స్టార్ ను వదలని ఆర్జీవీ

కొన్ని నెలల క్రితం చాలా హడావుడి చేసి పవర్ స్టార్ అనే ఎటిటి సినిమాను తీసారు దర్శకుడు ఆర్జీవీ. ఏటిటిలో ఆ సినిమాను ఎంత మంది చూసారు అన్నది ఎవరికీ లెక్కలు తెలియవు. అది…

కొన్ని నెలల క్రితం చాలా హడావుడి చేసి పవర్ స్టార్ అనే ఎటిటి సినిమాను తీసారు దర్శకుడు ఆర్జీవీ. ఏటిటిలో ఆ సినిమాను ఎంత మంది చూసారు అన్నది ఎవరికీ లెక్కలు తెలియవు. అది వేరే సంగతి.

ఆ సినిమాకు హడావుడి ఎక్కువ, విషయం తక్కువ అన్నట్లు విమర్శ వచ్చింది. ఆ సినిమా తో పాటే ఆర్జీవీ మిస్సింగ్ అనే  సినిమా స్టార్ట్ చేసారు. అందులో మెగా ఫ్యామిలీ క్యారెక్టర్లు అన్నీ వున్నాయంటూ టీజర్ లాంటిది వదిలారు. 

కరోనా టైమ్ లో గోవాలో ఆ సినిమాను పూర్తి చేసారు ఆర్జీవీ. అయితే గమ్మత్తు ఏమిటంటే ఈ పవర్ స్టార్ కూడా ఆ ఆర్జీవీ మిస్సింగ్ లో ఓ భాగంగా వుంటుందట. సినిమా ఆరంభంలోనో, చివర్లోనో, ఎక్కడో అక్కడ ఈ పవర్ స్టార్ సినిమా అంతా ప్లే అవుతుందన్నమాట. 

అంటే ఎటిటిలో కిట్టుబాటు కాని పవర్ స్టార్ ను మెయిన్ స్ట్రీమ్ సినిమాలో మిక్స్ చేసి ఆదాయం పొందాలనుకుంటున్నారేమో? కానీ ఎటిటిలో పెట్టినపుడు డౌన్ లోడ్ చేసి సోషల్ మీడియాలోకి వదిలేసారు కొందరు ఔత్సాహికులు.

ఆ విధంగా చాలా మంది చూసేసినట్లే. మరి ఇప్పుడు మళ్లీ ఆర్జీవీ మిస్సింగ్ అంటూ అదే చూపిస్తామంటే చూస్తారా?