కరోనా కారణంగా థియేటర్లలోకి రాలేక, ఓటిటిలో విడుదలైన సినిమా ఒరేయ్ బుజ్జిగా. యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా కొండా విజయ్‌కుమార్‌దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లలోకి వస్తోంది. గతంలో థియేటర్లలోకి వచ్చాక ఓటిటి లోకి వచ్చేది. ఇప్పుడు వ్యవహారం రివర్స్ అయింది.
ఒరేయ్ బుజ్జిగా సినిమా థియేటర్లలోకి వదలుతున్న సందర్భంగా చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ – “2021కి స్వాగతం పలుకుతూ నూతన సంవత్సర కానుకగా హిలేరియస్ ఎంటర్‌టైనర్ `ఒరేయ్ బుజ్జిగా..`ను జనవరి 1న గ్రాండ్‌గా విడుదలచేస్తున్నాం“ అన్నారు.
ఓటిటి లో చూడలేకపోయిన, చూడడానికి అవకాశం లేకపోయిన వారంతా థియేటర్ లో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నామన్నారు.
అన్నీ బాగుండి వుంటే థియేటర్లోకి వచ్చి వుండేదని కానీ కరోనా కారణంగా అలా జరగలేదని, చివరకు ఓటిటిలో విడుదల చేసామని, అక్కడ మంచి రెస్పాన్స్ రావడంతో, ఇప్పుడు థియేటర్లలోకి తీసుకువస్తున్నామని రాధామోహన్ వివరించారు.