సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే హడావుడి ముగిసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే రానుంది. సెప్టెంబర్ 2 కోసం ఇప్పటి నుంచి హడావుడి స్టార్ట్ అవుతోంది. ఆ రోజు కేవలం ఒక సినిమా నుంచి కాదు ఏకంగా మూడు సినిమాల నుంచి అప్ డేట్స్ రాబోతున్నాయి.
పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్-సాగర్ కాంబినేషన్ లో తయారవుతున్న 'భీమ్లా నాయక్' టైటిల్ అఫీషియల్ ప్రకటన రాబోతోంది.
క్రిష్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న హరిహర వీరమల్లు మేకింగ్ వీడీయో రాబోతోంది.
హరీష్ శంకర్-పవన్ కాంబినేషన్ లో రాబోయే సినిమా నుంచి కూడా ఇంట్రస్టింగ్ మెటీరియల్ రాబోతోంది. గతంలో ఈ సినిమా కోసమే పవన్ కు ఫొటో షూట్ చేసారు. కానీ అప్పట్లో పవన్ కు కరోనా రావడంతో విడుదల చేయలేదు. ఆ ఫొటో షూట్ విడుదల చేసే అవకాశం వుంది. దాంతో ఈ సినిమాలో పవన్ ఎలా వుండబోతున్నారో రివీల్ అవుతుంది. పోలీస్ ఆఫీసర్ పాత్ర అని టాక్ వుంది. కానీ హరీష్ శంకర్ సినిమాలో పవన్ పోలీస్ కానే కాదని పక్కా సమాచారం.
మొత్తం మీద సెప్టెంబర్ 2 పవర్ ఫుల్ బర్త్ డే వుండబోతోంది.