ప్రభాస్ కేరాఫ్ లండన్

మన హీరోలకు హైదరాబాద్ ఇరుకుగా వుంటుంది. ఎందుకంటే వాళ్లకు వున్న సెలబ్రిటీ స్టేటస్‌తో బయట కాలు పెట్టలేరు. ఓ రెస్టారెంట్ కు వెళ్లలేరు. షాపింగ్ కు వెళ్లలేరు. ఇరవై నాలుగు గంటలు ఇంట్లో హౌస్…

మన హీరోలకు హైదరాబాద్ ఇరుకుగా వుంటుంది. ఎందుకంటే వాళ్లకు వున్న సెలబ్రిటీ స్టేటస్‌తో బయట కాలు పెట్టలేరు. ఓ రెస్టారెంట్ కు వెళ్లలేరు. షాపింగ్ కు వెళ్లలేరు. ఇరవై నాలుగు గంటలు ఇంట్లో హౌస్ అరెస్ట్ మాదిరిగా కూర్చోవాల్సిందే.

షూటింగ్ వున్నా కూడా అయితే కేరవాన్ లేదంటే సెట్ లో.  అందుకే అవకాశం దొరికినపుడల్లా విదేశాలకు వెళ్లిపోతారు. అక్కడ వాళ్లకు చాలా స్వేచ్ఛగా వుంటుంది. ఇలాంటి ఐడియాతోనే విదేశాల్లో ఇళ్లు కొనడం కూడా చేస్తుంటారు. మహేష్ ఎప్పుడో దుబాయ్ లో ఇల్లు కొని వుంచారు.

ప్రభాస్ కూడా ఇప్పుడు లండన్ లో ఓ ఇల్లు తీసుకున్నారని తెలుస్తోంది. అయితే స్వంతానికి కాదు. అద్దెకు. నెలకు సుమారు అరవై లక్షల అద్దెకు ప్రభాస్ ఇల్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్రీ టైమ్ దొరికినపుడు వెళ్లి వుండడానికి ఈ ఇంటిని వాడుతున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ అక్కడే వున్నారు. కొద్ది రోజుల తరువాత ఇక్కడకు వచ్చి ప్రాజెక్ట్ కె, రాజా సాబ్ షూటింగ్ ల్లో పాల్గొంటారు. ప్రాజెక్ట్ కె వర్క్ పూర్తి చేసి, ఆ పై రాజాసాబ్ వర్క్ ముందు మూడు నాలుగు నెలల్లో ఫినిష్ చేస్తారు. ఆ తరువాత హను రాఘవపూడి సినిమా మీదకు వెళ్తారు ప్రభాస్.

ఇవి కాక ఇంకా స్పిరిట్, సలార్ 2 సినిమాలు ప్రభాస్ చేతిలో వున్నాయి.