ప్రభాస్ ఫ్యామిలీ ఇంట్రస్ట్

అందరికన్నా ముందుగా పాన్ ఇండియా హీరో అయిపోవడం వల్ల నేమో, బాహుబలి ప్రభాస్ కు భారీ యాక్షన్ సినిమాలు అంటే కాస్త మొహం మొత్తుతున్నట్లు కనిపిస్తోంది.  Advertisement ఇప్పటికే వాలంటరీగా ఓ సినిమాను మారుతి…

అందరికన్నా ముందుగా పాన్ ఇండియా హీరో అయిపోవడం వల్ల నేమో, బాహుబలి ప్రభాస్ కు భారీ యాక్షన్ సినిమాలు అంటే కాస్త మొహం మొత్తుతున్నట్లు కనిపిస్తోంది. 

ఇప్పటికే వాలంటరీగా ఓ సినిమాను మారుతి డైరక్షన్ లో చేస్తున్నాడు. ఓ పక్క ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె లాంటి భారీ యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. మరో పక్కన మాంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ చేయాలనే కోరికతో వున్నారని తెలుస్తోంది. ఫ్యామిలీ టచ్ వున్న సినిమాలు ప్రభాస్ నుంచి వచ్చి చాలా కాలం అయింది.

ఇటీవల ఓ నిర్మాత ప్రభాస్ ను కలిసినపుడు మాటల్లో, ఈ కోరిక వెలిబుచ్చాడట. మాంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ వుంటే చేద్దాం అని అన్నట్లు తెలుస్తోంది. దాంతో సదరు నిర్మాత ఇప్పుడు అలాంటి కథల కోసం అన్వేషణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 

ఫీల్ గుడ్ సినిమాలు అందించడంలో ఆ నిర్మాతకు మంచి ట్రాక్ రికార్డ్ వుంది. అందుకే ప్రభాస్ నుంచి అలాంటి ఆఫర్ వచ్చి వుంటుంది.

డార్లింగ్, మిస్టర్ పెర్ ఫెక్ట్, మిర్చిల తరువాత మాంచి ఫ్యామిలీ ఎమోషన్లు వున్న సినిమా ప్రభాస్ నుంచి రాలేదు. బాహుబలిలో ఎమోషన్లు వున్నా, భారీతనం వల్ల అన్నీ కలిసిపోయాయి. 

సో, అన్నీ సెట్ అయితే మాంచి ప్యూర్ ఫ్యామిలీ సినిమా ప్రభాస్ నుంచి వస్తుందన్నమాట. ఎంత ఎదిగినా అసలు మన సినిమా మూలాలు అవే కదా. ఎవరైనా ఎలా మర్చిపోతారు.