ప్రభాస్‌ తొందర పడట్లేదు

'సాహో' రిలీజ్‌ లేట్‌ అవుతోందనే ఫీలింగ్‌తో చివరి దశలో చాలా హడావిడిగా షూటింగ్‌ ముగించేసారు. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేయడంతో ఫైనల్‌ కట్‌ రెడీ అయిన తర్వాత మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం కూడా…

'సాహో' రిలీజ్‌ లేట్‌ అవుతోందనే ఫీలింగ్‌తో చివరి దశలో చాలా హడావిడిగా షూటింగ్‌ ముగించేసారు. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేయడంతో ఫైనల్‌ కట్‌ రెడీ అయిన తర్వాత మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం కూడా రాలేదు.

ఎడిటింగ్‌ పరంగా చిన్నపాటి మార్పులు, కొంత ప్యాచ్‌వర్క్‌ జరిగి వున్నట్టయితే ఆ చిత్రం గందరగోళంగా కాకుండా కాస్త అర్థవంతంగా అనిపించేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఆ చిత్రానికి జరిగిన తప్పులు ఈసారి రిపీట్‌ కాకుండా ప్రభాస్‌ జాగ్రత్త పడుతున్నాడు. తన తదుపరి చిత్రానికి అతను డెడ్‌లైన్స్‌ ఏమీ పెట్టడం లేదు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్‌ జరుపుకున్న ఆ చిత్రానికి స్క్రిప్ట్‌ మరోసారి రీచెక్‌ చేసుకున్నారు.

వచ్చే ఏడాదిలో విడుదల చేయాలనే ఆలోచన వుంది కానీ ఒకవేళ షూటింగ్‌కి ఎక్కువ సమయం అవసరమయితే 2021 రిలీజ్‌కి కూడా ప్రభాస్‌ అభ్యంతరం చెప్పడం లేదు.

'బాహుబలి' క్రేజ్‌ 'సాహో'ని సగం కాపాడింది. కానీ ఈ చిత్రానికి ఆ అడ్వాంటేజ్‌ వుండదు కనుక ఈసారి చాలా కేర్‌ తీసుకుంటున్నారు. సుజీత్‌లానే ఈ చిత్ర దర్శకుడు రాధాకృష్ణకి కూడా అనుభవం లేకపోవడంతో అతడిపై ఎలాంటి ఒత్తిడి పెట్టడం లేదు.

ప్రోడక్ట్‌ శాటిస్‌ఫాక్టరీ అనిపించే వరకు ఈ చిత్రం రిలీజ్‌ గురించి హడావిడి పడరాదని డిసైడ్‌ అయ్యారు.