ప్రభాస్ కోసం 12 సెట్లు వెయిటింగ్

కృష్ణంరాజు మరణతో, అనుకోకుండా ఇంట విషాదం నెలకొనడంతో ప్రభాస్ అండ్ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. కానీ ప్రభాస్ మీద చాలా బాధ్యతలు వున్నాయి.  Advertisement ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు చకచకా…

కృష్ణంరాజు మరణతో, అనుకోకుండా ఇంట విషాదం నెలకొనడంతో ప్రభాస్ అండ్ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. కానీ ప్రభాస్ మీద చాలా బాధ్యతలు వున్నాయి. 

ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు చకచకా పూర్తి చేయాల్సి వుంది. అందుకే ఈ నెల 19నే విషాదం అణచిపెట్టుకుని ఓ రోజు షూటింగ్ లో పాల్గొన్నాడని బోగట్టా.

ఇదిలా వుంటే సలార్ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో ఒకటి కాదు, రెండు కాదు 12 సెట్ లు వేసారట. ప్రతి సెట్ లోనూ జస్ట్ రెండు మూడు రోజులు మాత్రమే షూటింగ్ అంట. కానీ సెట్ లు వేయక తప్పలేదు. ఈ సెట్ లు అన్నీ ప్రభాస్-ప్రశాంత్ నీల్ కోసం వెయిట్ చేస్తున్నాయి. షూటింగ్ జరిపినా జరపకున్నా సెట్ లకు రోజుల లెక్కన డబ్బులు కడుతూనే వుండాలి. ఆ మీటర్ అలా రన్ అవుతూనే వుంటుంది.

త్వరలో ప్రభాస్ సలార్ సినిమా సెట్ మీదకు వచ్చి ఈ పన్నెండు సెట్ లకు మోక్షం కలిగిస్తాడని తెలుస్తోంది. సలార్ సినిమాను రెండు భాగాలుగా తీస్తున్నారు. కేజిఎఫ్ సిరీస్ తరువాత ప్రశాంత్ నీల్ అందిస్తున్న సినిమా ఇది. దీని మీద చాలా అంచనాలు వున్నాయి.