ప్రతి మనిషి జీవితంలోనూ శుక్ర మహాదశ అనేది ఒకటి వుంటుంది. అది వచ్చినపుడు జీవితం కాస్త ఉచ్ఛ స్థితిలో వుంటుంది. ఈ దశ ఎవరి జీవితంలో ఎప్పుడు వుంటుందన్నది వారి వారి పర్సనల్ హోరోస్కోప్ ను బట్టి వుంటుంది.
కొందరికి చిన్నతనంలోనే అయిపోవచ్చు. మరి కొందరికి యంగ్ ఏజ్ లో రావచ్చు. యంగ్ ఏజ్ లో వస్తే మాత్రం కెరీర్ పరంగా సూపర్ గా వుంటుంది అంటారు జ్యోతిష్కులు. ఆల్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరో గా పేరు తెచ్చుకుంటున్న ప్రభాస్ కు ఇప్పుడు శుక్ర మహా దశ నడుస్తోందట.
ఓ సిద్దాంతి చెప్పిన దాని ప్రకారం ప్రభాస్ జీవితంలో కొద్ది కాలం క్రితమే శుక్రమహాదశ ప్రారంభమైందని తెలుస్తోంది. అందువల్ల ఇక కెరీర్ కు కొన్నాళ్లు తిరుగువుండదు. అందుకే ఇప్పుడు వంద కోట్లుకు ఫైగా రెమ్యూనిరేషన్ తీసుకునే హీరోగా మారాడు.
తెలుగు హీరోల్లో ఈ రేంజ్ రెమ్యూనిరేషన్ తీసుకునే హీరో మరొకరు లేరు. కనీసం సమీపంలో కూడా లేరు. సలార్, ఆదిపురుష్, ప్రకటించబోయే మరో సినిమా, ఈ మూడు కలిపితేనే మూడు వందల కోట్ల ఆదాయం. ఇది కదా శుక్ర మహాదశ అంటే.
అన్నట్లు చిన్న బ్యాడ్ పాయింట్ ఏమిటంటే ప్రభాస్ లైఫ్ లో పెళ్లి వ్యవహారం మాత్రం అంత సానుకూలంగా అయితే లేదట. గ్రహాల ప్రభావం ఎవరేం చేయగలరు? మార్చగలరు?