టాలీవుడ్‌లో వివాద రహిత వ్యక్తిగా విక్టరీ వెంకటేశ్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతో ముఖ్యమైన విషయం ఉంటే తప్ప ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్కరు.
అలాంటిది ఇప్పుడాయన ఓ పోస్టు పెట్టారు. దీన్నిబట్టి ఆ పోస్టు ప్రాధాన్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల విడాకులతో వార్తల్లో హీరోగా నిలిచిన నాగచైతన్య ఆయనకు మేనల్లుడే.
ఈ నేపథ్యంలో వెంకటేశ్ తాజా పోస్టు వైరల్ అవుతోంది. ‘మనం ఏదైనా విషయంపై పెదవి విప్పే ముందు దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించాలి’ అంటూ వెంకీ పోస్ట్ పెట్టారు. నాగచైతన్య-సమంత జంట విడిపోవడంపై ఎవరికి తోచినట్టు వాళ్లు రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
దీంతో వెంకటేశ్ హితవు చెబుతున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంపై నెటిజన్లు స్పందిస్తున్నారు. నాగచైతన్య-సమంత జంట విడాకులకు దారి తీసిన పరిస్థితుల గురించి నిజాలు వెల్లడించనంత వరకూ ఇలాంటి ఉంటాయని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
మనం వద్దని వారించేకొద్ది విడాకులపై స్పందించే వాళ్లు ఎక్కువవుతారని నెటిజన్లు కుండబద్దలు కొట్టినట్టు చెబుతుండటం గమనార్హం.